అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rajya Sabha Nomination | తెలంగాణ (Telangana) నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ తరఫున అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నామినేషన్ వేశారు. ఈ మేరకు గురువారం ఎన్నికల అధికారి ఉపేందర్‌రెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేశారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్, పలువురు మంత్రులు హాజరయ్యారు.
Rajya Sabha Nomination | తెలంగాణ నుంచి రెండో సారి..
ఈ సందర్భంగా అభిషేక్ సింఘ్వీ (Abhishek Singhvi) మాట్లాడుతూ తెలంగాణ తరఫున రాజ్యసభకు రెండోసారి వెళ్లడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్, కేసీ వేణుగోపాల్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే వేం నరేందర్ రెడ్డి (Vem Narender Reddy) మాట్లాడుతూ రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించిన అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు.
Rajya Sabha Nomination | చర్చలు, సంప్రదింపుల తర్వాత..

రాజసభ అభ్యర్థుల ఎంపికకు కాంగ్రెస్ పార్టీ (Congress Party) తీవ్ర కసరత్తు చేసింది. ఒక స్థానానికి ప్రస్తుతం సిటింగ్ ఎంపీగా ఉన్న అభిషేక్ మను సింఘ్వీ పేరును కాంగ్రెస్ ఎంపిక చేయగా.. రెండో స్థానానికి అభ్యర్థి ఎవరనే దానిపై రాత్రి వరకు చర్చలు, సంప్రదింపులు జరిగాయి. చివరకు వేం నరేందర్‌రెడ్డి పేరును ఖరారు చేశారు.
Rajya Sabha Nomination | ముఖ్యమంత్రి కోరిక మేరకు..!
వేం నరేందర్‌రెడ్డి రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)కోరినట్లుగా తెలుస్తోంది. అందరితో సన్నిహితంగా ఉండడం.. ఎవరి నుంచి అభ్యంతరాలు రాకపోవడంతో అధిష్ఠానం సీఎం మాటకు ప్రాధాన్యం ఇచ్చి నరేందర్‌రెడ్డి పేరును ఎంపిక చేసింది. అయితే.. ఒకవేళ బీఆర్‌ఎస్ అభ్యర్థిని రంగంలోకి దింపినట్లయితే రెండో స్థానానికి పోటీ జరగనుంది. లేకపోతే రెండు స్థానాలను కాంగ్రెస్ ఏకగ్రీవంగా దక్కించుకునే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి..: Nagpur Incident | హోలీ రోజు షాకింగ్ ఘటన.. మనవడిపై మరుగుతున్న నీళ్లు కుమ్మరించిన బామ్మ

