అక్షరటుడే నిజామాబాద్ క్రైం: Nizamabad Canal Car Accident | కెనాల్లో కారు బోల్తాపడగా ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన నిజామాబాద్ బైపాస్ సమీపంలో (bypass road crash) బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఘటనాస్థలాన్ని సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) పరిశీలించారు.
Nizamabad Canal Car Accident | కామారెడ్డి జిల్లా దోమకొండ..
కామారెడ్డి(kamareddy district) జిల్లా దోమకొండ(Domakonda) ప్రాంతానికి చెందిన చింతల శ్రీనివాస్ ఇటుకల బట్టీ వ్యాపారస్తుల వద్ద పని చేస్తున్నాడు. అయితే బట్టీలో పనిచేసేందుకు కార్మికుల కోసం నాందేడ్ వెళ్లాడు. అక్కడ ఓ కుటుంబంతో బట్టీలో పనిచేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. వారితో దోమకొండకు తిరుగుప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని (Dichpally police station) బైపాస్ రోడ్డు ప్రాంతంలో కారు అదుపుతప్పి కెనాల్ పైనుంచి నీళ్లలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Nizamabad Canal Car Accident | సంఘటనా స్థలాన్ని పరిశీలంచిన సీపీ..
సంఘటన స్థలాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య పరిశీలించారు. సంఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ( telangana crime news) సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ కారు డ్రైవర్ అతివేగంగా అజాగ్రత్తగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా గుర్తించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, ముఖ్యంగా బైపాస్ రోడ్డులో అతివేగంగా వాహనాలు నడపరాదని హెచ్చరించారు. డిచ్పల్లి ఎస్సై ఎండీ ఆరిఫ్, నిజామాబాద్ రూరల్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ తదితరులు సీపీ వెంట ఉన్నారు.

ఇది కూడా చదవండి: Inter Exams Malpractice | మాల్‌ప్రాక్టీస్ జరగకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ ఇలాత్రిపాఠి

