అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad Building Collapse | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మరో ఘోర ప్రమాదం జరిగింది. టోలీచౌకీలోని ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. దీంతో అక్కడికక్కడే నలుగురు దుర్మరణం చెందారు.
Hyderabad Building Collapse | మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా..
వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెస్య్కూ బృందాలు (Rescue teams) సహాయక చర్యలు చేపట్టాయి. కాగా.. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Hyderabad Building Collapse | వరుస ప్రమాదాలు..
హైదరాబాద్ నగరంలో ఇటీవల వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. బాచుపల్లి (Bachupalli) లోని ప్రగతి నగర్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. రోడ్డు పక్కన ఫర్నిచర్ షాపులో మంటలు చెలరేగాయి. అనంతరం ఫుట్‌పాత్‌పై ఉన్న షాపుల్లోకి వ్యాపించి 50 షాపులు దగ్ధం అయ్యాయి. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. అలాగే నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాపులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం విదితమే. ఈ ప్రమాదంలో ఓ మహిళ, ఇద్దరు చిన్నారులతోపాటు వీరిని కాపాడేందుకు వెళ్లిన మరో ఇద్దరు మంటల్లో చిక్కుకొని సజీవదహనమైన విషయం తెలిసిందే. వరుస ప్రమాదాలు హైదరాబాద్ (Hyderabad) నగర వాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఇది కూడా చదవండి..: Bachupally Fire Accident | బాచుపల్లిలో భారీ అగ్ని ప్రమాదం

