అక్షరటుడే, వెబ్‌డెస్క్: Realme Narzo Power 5G | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మీ మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో భారీ బ్యాటరీ సామర్థ్యంలో మరో ఫోన్‌ను తీసుకువచ్చింది. రియల్‌మీ నార్జో పవర్ 5 జీ పేరుతో తీసుకువచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ (Realme Narzo Power 5G) గురువారం మధ్యాహ్నం భారత మార్కెట్‌లో విడుదలయ్యింది. 10వ తేదీనుంచి సేల్స్ ప్రారంభం కానున్నాయి. అమెజాన్, రియల్‌మీ వెబ్‌సైట్లతో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు ఇలా ఉన్నాయి.
Realme Narzo Power 5G | డిస్‌ప్లే..
6.78 అంగుళాల డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఐపీ66/68/69 వాటర్, డస్ట్ రెసిస్టెంట్ సర్టిఫికెట్ ఉంది.
Realme Narzo Power 5G | సాఫ్ట్‌వేర్..
మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా 5జీ ప్రాసెసర్‌ను అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మీ యూఐ 7.0 సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తుంది. మూడేళ్లపాటు ఓఎస్, నాలుగేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనుంది.
Realme Narzo Power 5G | బ్యాటరీ..
10,001 ఎంఏహెచ్ సామర్థ్యం గల భారీ బ్యాటరీ ఉంది. 80డబ్ల్యూ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. 36 నిమిషాలలో 50 శాతం, 85 నిమిషాల్లో బ్యాటరీని ఫుల్ చార్జ్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే సింగిల్ చార్జ్‌తో 2 రోజుల వరకు ఉపయోగించవచ్చని పేర్కొంది. ఇందులో 27డబ్ల్యూ వైర్డ్ రివర్స్ చార్జింగ్ సౌలభ్యం కూడా ఉంది. అంటే ఈ ఫోన్‌తో ఇతర ఫోన్లను కూడా చార్జ్ చేయవచ్చు. 185.7 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 72.3 గంటల కాలింగ్, 32.5 గంటల యూట్యూబ్ ప్లే చేయవచ్చని కంపెనీ తెలిపింది. బ్యాటరీపై నాలుగేళ్ల వారంటీ అందిస్తోంది.
కెమెరా..
50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 882 ఓఐఎస్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్‌కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.
ఏఐ ఫీచర్స్..
ఏఐ హైపర్ క్లారిటీ, ఏఐ హైపర్ మోషన్, ఏఐ ఆల్వేస్ ఆన్ హెచ్‌డీఆర్, ఏఐ స్మార్ట్ రిప్లై, ఏఐ స్టైల్‌మీ, ఏఐ ఎడిట్ జెనీ, ఇన్‌స్టంట్ క్లిప్, లైట్‌మీ లైటింగ్ ఎఫెక్ట్‌లు మరియు గేమింగ్ కోసం ఏయిమ్ అసిస్ట్ వంటి ఫీచర్లున్నాయి.
వేరియంట్స్..
- టైటాన్ సిల్వర్, టైటాన్ బ్లూ కలర్స్‌లో రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
- 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 27,999.
- 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999.
- ప్రారంభ ఆఫర్..
ప్రారంభ ఆఫర్‌లో భాగంగా వెయ్యి రూపాయల తక్షణ డిస్కౌంట్ అందిస్తోంది. అంతేకాకుండా ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులతోపాటు ఈఎంఐ ఆప్షన్‌పై రూ. 3 వేల వరకు డిస్కౌంట్ లభించనుంది. ఆరు నెలల వరకు నోకాస్ట్ ఈఎంఐ సౌలభ్యం కూడా ఉంది.
ఇది కూడా చదవండి..: iQOO 15R Launch | ఐకూనుంచి మిడ్‌రేంజ్‌లో పవర్‌ఫుల్ ఫోన్..! ప్రీ బుకింగ్‌తో ఐకూ టీడబ్ల్యూఎస్ ఫ్రీ..

