అక్షరటుడే, వెబ్‌డెస్క్: India vs England Semi | టీ20 వరల్డ్‌కప్ 2026 సెమీఫైనల్‌లో టీమ్ ఇండియా భారీ స్కోర్ చేసింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో భారత్ ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసి ఇంగ్లండ్‌కు భారీ లక్ష్యానికి నిర్దేశించింది.
India vs England Semi | సంజూ అద్భుత ఇన్నింగ్స్
ఓపెనర్ అభిషేక్ శర్మ (9 రాణించలేక ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (11 ) పెద్దగా ప్రభావం చూపలేక పోయాడు. తర్వాత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్ (89) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
ఇషాన్ కిషన్ (39) విలువైన ఇన్నింగ్స్ ఆడగా, మధ్యవరుసలో శివమ్ దూబే (43) జత కలిశాడు. తిలక్ వర్మ (21) సహకరించాడు. చివర్లో హార్దిక్ పాండ్యా (27) వేగంగా ఆడి జట్టు పరుగులను 250 దాటించాడు.
India vs England Semi | భారీ లక్ష్యం
ఇంగ్లండ్ బౌలర్లలో రషీద్ ఖాన్,విల్ జాక్స్ చెరో రెండు వికెట్లు తీసుకున్నాడు. ఆడిల్ రషీద్ ఒక వికెట్ తీసుకున్నాడు. కానీ భారత బ్యాటర్ల దూకుడును నియంత్రించలేకపోయారు.
ఇక ఇంగ్లండ్ జట్టు 254 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. ఇంగ్లండ్ బ్యాటర్లు ఈ లక్ష్యాన్ని ఎలా ఎదుర్కొంటారన్నది వేచి చూడాలి. కాగా, ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మార్చి 8వ తేదీన జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడనుంది.

