Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: India Semi Final Win | సెమీస్‌లో భారత్ థ్రిల్లింగ్ విజయం.. 25 రికార్డులు నమోదు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రీడలు - India Semi Final Win | సెమీస్‌లో భారత్ థ్రిల్లింగ్ విజయం.. 25 రికార్డులు నమోదు

క్రీడలు

India Semi Final Win | సెమీస్‌లో భారత్ థ్రిల్లింగ్ విజయం.. 25 రికార్డులు నమోదు

టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్‌లో భారత్ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్‌ను 7 పరుగుల తేడాతో ఓడించింది. ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో మొత్తం 25 కీలక రికార్డులు నమోదయ్యాయి.

Srinivas kolluri
Last updated: మార్చి 6, 2026 10:46 ఉద.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
India Semi Final Win

అక్షరటుడే, వెబ్​డెస్క్ : India Semi Final Win | టీ20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు (India) మరోసారి తమ సత్తా చాటింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్‌పై 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ హై-స్కోరింగ్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఉత్కంఠభరిత అనుభూతిని ఇచ్చింది. మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే భారత బ్యాటర్లు ఆ నిర్ణయాన్ని తప్పు అని నిరూపిస్తూ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శించారు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 7 వికెట్లు కోల్పోయి 253 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు కూడా ధైర్యంగా పోరాడింది. కానీ చివరికి 246 పరుగుల వద్దే ఆగిపోవడంతో భారత్ 7 పరుగుల తేడాతో గెలిచింది.

Contents
  • India Semi Final Win | 25 రికార్డులు ఇవే..
    • India Semi Final Win | అత్యధిక సిక్సర్లు

India Semi Final Win | 25 రికార్డులు ఇవే..

ఈ మ్యాచ్‌లో అత్యంత చర్చనీయాంశంగా నిలిచింది ఇంగ్లాండ్ యువ ఆటగాడు జాకబ్ బెథెల్ (Jacob) ప్రదర్శన. అతను కేవలం 19 బంతుల్లో అర్ధశతకం సాధించి టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లలో వేగవంతమైన ఫిఫ్టీల జాబితాలో చోటు సంపాదించాడు. ఈ రికార్డు న్యూజిలాండ్ ఆటగాడు ఫిన్ అలెన్ చేసిన 19 బంతుల ఫిఫ్టీకి సమానం. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇంగ్లాండ్ తరఫున ఇదే వేగవంతమైన అర్ధశతకంగా కూడా బెథెల్ ఇన్నింగ్స్ నిలిచింది. ఇదే మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు 8.1 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేయడం కూడా ఒక రికార్డుగా నిలిచింది.

భారత్ తరఫున ఓపెనర్ సంజూ శాంసన్ అద్భుతంగా ఆడుతూ 89 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు. టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లలో భారత్ తరఫున 50కి పైగా స్కోరు చేసిన ఓపెనర్ల జాబితాలో గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తర్వాత సంజూ శాంసన్ కూడా చేరాడు.

ఈ టోర్నమెంట్‌( India Semi Final Win )లో సంజూ శాంసన్ మరో రికార్డును కూడా తన పేరున నమోదు చేసుకున్నాడు. ఒకే ఎడిషన్‌లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు (16) కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. ఇదే సమయంలో టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రోహిత్ శర్మ 47 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

India Semi Final Win | అత్యధిక సిక్సర్లు

ఈ మ్యాచ్ హై-స్కోరింగ్ థ్రిల్లర్‌గా నిలిచింది. టీ20 వరల్డ్ కప్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డు కూడా నమోదైంది. భారత్–ఇంగ్లాండ్ మ్యాచ్‌లో మొత్తం 19 సిక్సర్లు నమోదయ్యాయి. అంతేకాదు ఒకే మ్యాచ్‌లో మొత్తం 34 సిక్సర్లు బాద‌డం కూడా కొత్త రికార్డుగా నిలిచింది.

భారత్ చేసిన 253/7 స్కోరు టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక జట్టు స్కోర్లలో ఒకటిగా నిలిచింది. అంతేకాకుండా నాకౌట్ మ్యాచ్‌లో 200కు పైగా స్కోరు నమోదవడం అరుదైన విషయం. టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లలో ఇది రెండోసారి మాత్రమే జరిగింది.

బౌలింగ్ పరంగా కూడా కొన్ని అరుదైన రికార్డులు నమోదయ్యాయి. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ 4 ఓవర్లలో 61 పరుగులు ఇచ్చి నాకౌట్ మ్యాచ్‌లో ఖరీదైన స్పెల్ నమోదు చేశాడు. అలాగే భారత్ తరఫున వరుణ్ చక్రవర్తి 1 వికెట్ తీసి 64 పరుగులు ఇవ్వడం కూడా ఖరీదైన స్పెల్‌గా నిలిచింది.

మొత్తంగా ఈ సెమీఫైనల్ Semi Final మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ పరంగా అనేక అరుదైన రికార్డులు నమోదయ్యాయి. మొత్తం కీలక రికార్డులు నమోదవడం ఈ మ్యాచ్ ప్రత్యేకతగా నిలిచింది. భారత్ ఈ విజయం (India Semi Final Win) ద్వారా టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరుకుని టైటిల్‌కు మరో అడుగు దూరంలో నిలిచింది. ఇప్పుడు ఫైనల్‌లో భారత జట్టు ప్రదర్శనపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

దీనిని కూడా చదవండి : India vs England Semi | ఉత్కంఠభరిత పోరులో భారత్​ విజయం.. చివరి వరకు పోరాడి ఓడిన ఇంగ్లండ్​.. 8న న్యూజిలాండ్​తో తుదిపోరు!

India vs New Zealand Final | భారత్ vs న్యూజిలాండ్: T20 వరల్డ్ కప్ ఫైనల్‌లో టాస్ అత్యంత కీలకం..
T20 World Cup | సెమీస్ ఆశలు పదిలం.. జింబాబ్వేపై భారత జట్టు విజయభేరి
West Indies Team Travel | యుద్ధం వ‌ల‌న‌ భారత్‌లో చిక్కుకున్న వెస్టిండీస్ జట్టుకి గుడ్ న్యూస్.. తొమ్మిది రోజుల తర్వాత స్వదేశానికి ప్రయాణం
T20 World Cup Semifinals | టీ20 వరల్డ్ కప్ సెమీస్ సమరం.. సౌతాఫ్రికా-న్యూజిలాండ్ ఢీ, ఇంగ్లాండ్ ప్రత్యర్థి ఎవ‌రో?
SRH New Captain | ఐపీఎల్ 2026లో SRHకి కొత్త కెప్టెన్.. అభిషేక్ శర్మ లేదా ఇషాన్ కిష‌న్‌ల‌లో ఒక‌రిని ఎంపిక చేసే ఛాన్స్..
TAGGED:cricket semi final thrillerIndia semi final winindia vs englandRohit Sharma statsSanju Samson inningsT20 World Cup 2026T20 World Cup records
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Hyderabad Water Supply Hyderabad Water Supply | హైదరాబాద్​ వాసులకు అలెర్ట్.. తాగునీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం
Next Article Wanaparthy Road Accident Wanaparthy Road Accident | ట్రాక్టర్​ను ఢీకొన్న ఆటో.. ఇద్దరు మృతి
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?