అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Police Rescue | అత్యవసర సమయంలో చురుకుగా స్పందించి కామారెడ్డి పోలీసులు (Kamareddy Police) ప్రశంసలు అందుకుంటున్నారు. జిల్లాలో ఇలాంటి సంఘటనలు జరుగగా తాజాగా ఆత్యహత్నాయత్నం చేసుకుంటున్నట్లు సమాచారం అందిన క్షణాల్లోనే స్పందించి ప్రాణాలు కాపాడారు.
Kamareddy Police Rescue | భిక్కనూరు మండల కేంద్రంలో..
భిక్కనూరు మండల (Bhikkhunur Mandal) కేంద్రంలో గురువారం రాత్రి ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేస్తున్నట్లుగా డయల్ 100కు కాల్ వచ్చింది. వెంటనే స్పందించిన బ్లూకోల్ట్ సిబ్బంది (Bluecolt Staff) క్షణాల్లోనే సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన బాధితుడి ఇంటికి వెళ్లి తలుపులు బద్దలుకొట్టారు. ఉరివేసుకున్న బాధితుడికి కిందికి దింపారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న బాధితుడికి సీపీఆర్ చేశారు. ప్రాణాలు కాపాడారు. ఆపద సమయంలో సమాయస్ఫూర్తి ప్రదర్శించి ప్రాణాలు కాపాడిన బ్లూకోల్ట్ సిబ్బంది వినయ్ కుమార్, రామాంజనేయులును జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) ప్రత్యేకంగా అభినందించారు.
ఇది కూడా చదవండి..: Head Constable Death | గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

