అక్షరటుడే, ఎల్లారెడ్డి: Science Fair Students Creativity | సైన్స్ ఫెయిర్‌తో విద్యార్థుల్లో (Student Innovation) సృజనాత్మకత పెంపొందుతుందని.. కొత్త ఆవిష్కరణలు వస్తాయని జిల్లా సైన్స్ అధికారి సిద్దిరాంరెడ్డి అన్నారు. ఎల్లారెడ్డి (Yellareddy School Event) మండల కేంద్రంలోని జీవదాన్ పాఠశాలలో (Jeevadan School) శుక్రవారం సైన్స్ ఫెయిర్‌ను (Science Fair) నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు తయారుచేసిన ప్రయోగాలను వీక్షించి, అభినందించారు.
Science Fair Students Creativity | ‘మిసైల్ మెన్’ను ఆదర్శంగా తీసుకోవాలి..
‘మిసైల్ మెన్’గా పేరు పొందిన ఏపీజే అబ్దుల్ కలాంను (APJ Abdul Kalam) ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉత్తమ పౌరులుగా ఎదగాలని సిద్దిరాంరెడ్డి సూచించారు. ఉన్నత విద్యను అభ్యసించి భావి భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చదువుతోనే సమాజంలో మనిషికి గుర్తింపు ఉంటుందన్నారు. సైంటిస్టులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.
Science Fair Students Creativity | ఆకట్టుకున్న సైన్స్ ఫెయిర్
జీవదాన్ పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ నూతన ఆవిష్కరణలతో అట్టహాసంగా జరిగింది. విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, సోలార్ ఎనర్జీ, ఏఐ (AI) పరిష్కారాల వంటి వినూత్న అంశాలపై ప్రాజెక్ట్‌లను ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటున్నారు. నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఇవి విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందుతాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. పర్యావరణ స్పృహ: ‘సేవ్ ది ప్లానెట్’, ‘సేవ్ ది ఎర్త్’, ‘సోర్స్ ఆఫ్ వాటర్’ వంటి అంశాలపై విద్యార్థులు ప్రదర్శనలు ఇస్తున్నారు.
Science Fair Students Creativity | పర్యావరణహిత ప్రయోగాలు..
స్మార్ట్ సిటీలు, ఏఐ (AI in Education), పర్యావరణహిత పరిష్కారాలను చూపుతూ ప్రాజెక్టులను రూపొందించారు. పాతతరాల నుంచి నేటివరకు ఉపయోగించిన వస్తువులు.. నూతన ఆవిష్కరణ ప్రయోగాల ద్వారా విద్యార్థులకు ప్రజలకు విద్యార్థులు వివరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో పాఠశాల ఫాదర్ ప్రిన్సిపాల్ బాబు, జోబిష్, సనూఫ్, శ్రీకాంత్, మేరి కుమారి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Kamareddy Municipal Controversy | కామారెడ్డిలో మున్సిపల్ అధికారులపై కౌన్సిలర్ల ఆగ్రహం..

