Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Prajapalana Pragathi Pranalika | భీమ్​గల్​లో జోరుగా ‘ప్రజల వద్దకే పాలన.. ప్రగతికి ప్రణాళిక’
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Prajapalana Pragathi Pranalika | భీమ్​గల్​లో జోరుగా ‘ప్రజల వద్దకే పాలన.. ప్రగతికి ప్రణాళిక’

నిజామాబాద్

Prajapalana Pragathi Pranalika | భీమ్​గల్​లో జోరుగా ‘ప్రజల వద్దకే పాలన.. ప్రగతికి ప్రణాళిక’

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలో 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' కార్యక్రమం శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. మున్సిపల్ ఛైర్‌పర్సన్ బోదిరే నాగమణి స్వామి ఆరో వార్డులో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 6, 2026 6:37 సా.
Shashi kiran Mottala
3 వారాలు ago
Share
Prajapalana Pragathi Pranalika |
Prajapalana Pragathi Pranalika | భీమ్​గల్​లో జోరుగా ‘ప్రజల వద్దకే పాలన.. ప్రగతికి ప్రణాళిక’

అక్షరటుడే, భీమ్​గల్: Prajapalana Pragathi Pranalika | రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలో (Bheemgal Municipality) ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. మున్సిపల్ ఛైర్‌పర్సన్ బోదిరే నాగమణి స్వామి ఆరో వార్డులో (Public Welfare Scheme) ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) ఆదేశాల (Telangana Government Program) మేరకు నేటి నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ఈ ప్రత్యేక ప్రణాళిక అమలులో ఉంటుందని తెలిపారు.

Contents
  • ​Prajapalana Pragathi Pranalika | బహుళ లక్ష్యాలతో ముందుకు..
    • ​Prajapalana Pragathi Pranalika | పంచాయతీల్లో..

​Prajapalana Pragathi Pranalika | బహుళ లక్ష్యాలతో ముందుకు..

ఈ కార్యక్రమంలో భాగంగా 99 రోజుల్లో పారిశుధ్యం, ప్రభుత్వ ఫైళ్ల పరిష్కారం, ఆరోగ్యం, మహిళా సంక్షేమం, పిల్లల భద్రత, డ్రగ్స్ నివారణ, రైతులకు అవగాహన, పర్యావరణ రక్షణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ఛైర్‌పర్సన్ వివరించారు. కార్యక్రమంలో భాగంగా వార్డుల్లో మురికి కాల్వల పూడికతీత, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, ఫాగింగ్ వంటి పారిశుధ్య పనులను చేపట్టారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో వైస్ ఛైర్‌పర్సన్ సంటిలత నర్సయ్య, కమిషనర్ గంగాధర్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

​Prajapalana Pragathi Pranalika | పంచాయతీల్లో..

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం (Municipal Administration India) భీమ్​గల్​ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో అవగాహన సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో చేపట్టాల్సిన 99 రోజుల ప్రణాళికపై ప్రజాప్రతినిధులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీ ఆవరణలో పారిశుధ్య (సానిటేషన్) పనులను ప్రత్యేకంగా నిర్వహించారు. మురికి కాల్వల శుభ్రం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటి పనులను సర్పంచ్‌లు స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లు మాట్లాడుతూ.. గ్రామాలను రోగరహితంగా తీర్చిదిద్దడమే ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశమని, ప్రజలందరూ పారిశుధ్య సిబ్బందికి సహకరించాలని కోరారు. ఆయా గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు మరియు సానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

praGA1

ఇది కూడా చదవండి: Special Intensive Revision | త్వరలో తెలంగాణతో పాటు మరిన్ని రాష్ట్రాల్లో SIR.. నోటిఫికేషన్‌ విడుదల

Holi Boy Drowned | హోలీ వేళ విషాదం.. చెరువులో పడి బాలుడి మృతి
Surender Birthday Celebrations | ఘనంగా మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ జన్మదిన వేడుకలు
Auto Accident Kamareddy | ఆటో బోల్తా.. ఇద్దరు చిన్నారులకు గాయాలు
Shabbir Ali Comments | కేసీఆర్​ ఖజానా ఖాళీ చేసి వెళ్లిండు.. అయినా పథకాలు అమలు చేస్తున్నాం..: షబ్బీర్​ అలీ
Quality Education for Students | విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి: స్పెషల్​ ఆఫీసర్​ విజయలక్ష్మి
TAGGED:Bheemgal MunicipalityCM Revanth ReddyMunicipal Administration IndiaPublic Welfare SchemeRural Development TelanganaTelangana Government Program
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Special Intensive Revision Special Intensive Revision | త్వరలో తెలంగాణతో పాటు మరిన్ని రాష్ట్రాల్లో SIR.. నోటిఫికేషన్‌ విడుదల
Next Article Harish Rao Criticism Harish Rao Criticism | ప్రజలను మోసం చేసేందుకే ‘99 రోజుల ప్రణాళిక’ : హరీశ్​రావు
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?