Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: SC Categorization Support | మాదిగల డిమాండ్​లో న్యాయం ఉంది : సీఎం రేవంత్​రెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

Uncategorized - SC Categorization Support | మాదిగల డిమాండ్​లో న్యాయం ఉంది : సీఎం రేవంత్​రెడ్డి

Uncategorized

SC Categorization Support | మాదిగల డిమాండ్​లో న్యాయం ఉంది : సీఎం రేవంత్​రెడ్డి

ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగ సామాజిక వర్గం డిమాండ్​లో న్యాయం ఉందని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి అన్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 6, 2026 7:17 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
SC Categorization Support

అక్షరటుడే, వెబ్​డెస్క్ : SC Categorization Support | ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగ సామాజిక వర్గం డిమాండ్​లో న్యాయం ఉందని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఎస్సీ వర్గీకరణకు చట్టపరమైన మద్దతు ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మాదిగ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం సీఎంను ఘనంగా సన్మానించారు.

Contents
  • SC Categorization Support | మద్దతు ఇచ్చా
    • SC Categorization Support | అండగా నిలిచా

హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని లలిత కళా తోరణంలో జరిగిన సభలో సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడారు. తమ ప్రభుత్వం ప్రజలకు చెందినదని అన్నారు. 2023 ఎన్నికల సమయంలో తన పార్టీకి పరిపాలనా యంత్రాంగం, అక్రమ సంపద లేదన్నారు. తమపై అక్రమ కేసులు పెట్టి, మరోవైపు అక్రమ సంపాదన గెలవాలని ప్రయత్నించారని బీఆర్​ఎస్​ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేవారు. నిజాయితీ, అంకితభావంతో ఎన్నికల్లో నిలబడిన తమకు ప్రజలు మద్దతు తెలిపారన్నారు.

SC Categorization Support | మద్దతు ఇచ్చా

ఎస్సీ వర్గీకరణ అంశం చాలా సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉందని సీఎం అన్నారు. న్యాయం కోసం పోరాటంలో అనేక మంది తమ ప్రాణాలను కూడా త్యాగం చేశారని గుర్తు చేశారు. తాను 20 సంవత్సరాలకు పైగా పోరాటాన్ని స్వయంగా చూశానని పేర్కొన్నారు. వీలు అయినప్పుడల్లా వర్గీకరణకు మద్దతు తెలిపానన్నారు. మందకృష్ణ మాదిగ (Mandakrishna Madiga), సతీష్ మాదిగ వంటి నాయకులు తనను సంప్రదించినప్పుడు, తాను మద్దతు ఇచ్చి వారికి అండగా నిలిచానని గుర్తు చేసుకున్నారు.

SC Categorization Support | అండగా నిలిచా

మాదిగ వర్గం డిమాండ్‌లో న్యాయం ఉందని, సమాజంలోని బలహీన వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందున తాను వారికి అండగా నిలిచానని సీఎం అన్నారు. రాజకీయ ఒత్తిడి ఉన్నప్పటికీ, మాదిగ వర్గానికి మద్దతు ఇవ్వడానికి తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. ఉద్యోగులు కష్టపడి పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. విద్యారంగానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

దీనిని కూడా చదవండి : Telangana IPS Cadre | కేంద్ర మంత్రి అమిత్​షాతో సీఎం రేవంత్​ భేటీ.. ఐపీఎస్​లను కేటాయించాలని విన్నపం!

Okha Tirupati Express | ఓఖా–తిరుపతి వీక్లీ ఎక్స్​ప్రెస్​లో మార్పులు
Manala Mohan Reddy | తండాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలి : మానాల మోహన్​రెడ్డి
Telangana Budget Session | ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన : గవర్నర్​
Kavitha Arrest Narsingi | నార్సింగ్​లో ఉద్రిక్తత.. కల్వకుంట కవిత అరెస్టు!
KTR Slams Congress | అవినీతి, అరాచకమే కాంగ్రెస్ పాలన : కేటీఆర్​
TAGGED:Madiga community newsMadiga reservation demandReservation policy IndiaRevanth Reddy statementSC categorization supportsocial justice TelanganaTelangana PoliticsTelangana SC classification
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Qatar oil price warning Qatar oil price warning | చమురు ధరలు రెట్టింపు అవుతాయా.. ఖతార్​ సంచలన ప్రకటన
Next Article Varshit Reddy UPSC Rank | Varshit Reddy UPSC Rank | భీమ్​గల్​ యువకుడికి సివిల్స్​లో ఆల్​ఇండియా ర్యాంక్​
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?