భీమ్గల్, అక్షరటుడే: Varshit Reddy UPSC Rank | సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో భీమ్గల్ మండలం (Bheemgal News) ముచ్కూర్ గ్రామానికి చెందిన శనిగరం వర్షిత్ రెడ్డి అద్భుత ప్రతిభ కనబర్చారు. కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) విడుదల చేసిన ఫలితాల్లో ఆయన ఆల్ ఇండియా స్థాయిలో 259వ ర్యాంకు సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు.
Varshit Reddy UPSC Rank | ముచ్కూర్ గ్రామానికి చెందిన..
ముచ్కూర్ గ్రామానికి (Muchkur Village) చెందిన శనిగరం నవీన్ రెడ్డి కుమారుడైన వర్షిత్ రెడ్డి, తన విద్యాభ్యాసం మొత్తాన్ని హైదరాబాద్‌లోనే కొనసాగించారు. కష్టపడి చదివి దేశంలోనే అత్యున్నతమైన ఉద్యోగానికి (Varshit Reddy UPSC Rank) ఎంపికవ్వడం పట్ల గ్రామ యువత (Telangana Youth Achievement), ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పట్టుదలతో ఈ విజయాన్ని(Nizamabad News) అందుకున్న వర్షిత్ రెడ్డిని పలువురు కొనియాడారు. సొంత ఊరి నుంచి ఇలాంటి ఉన్నత స్థాయి (UPSC Success Story) అధికారి రావడం సంతోషంగా ఉందని గ్రామస్థులు పేర్కొన్నారు. వర్షిత్ రెడ్డి కుటుంబ సభ్యులకు గ్రామస్థుల తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

ఇది కూడా చదవండి: SC Categorization Support | మాదిగల డిమాండ్లో న్యాయం ఉంది : సీఎం రేవంత్రెడ్డి

