అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: CP Saichaitanya Iftar | నగరంలోని రెండో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జామా మసీద్‌లో (Jama Masjid Nizamabad) మజీద్ కమిటీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు (Ramzan Iftar) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీ సాయిచైతన్య (CP Saichaitanya) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
CP Saichaitanya Iftar | ప్రత్యేక ప్రార్థనలు..
ఈ సందర్భంగా సీపీ సాయిచైతన్య ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముక్తి సయీద్ అక్బర్ నిర్వహించిన దువాలో సీపీ (Telangana Police News) పాల్గొని, అనంతరం ఉపవాస విరమణ చేశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. రంజాన్ మాసం విశిష్టతను విశ్లేషణాత్మకంగా వివరించారు. రంజాన్ అనేది కేవలం ఉపవాసాల నెల మాత్రమే కాకుండా, మనస్సును పరిశుభ్రం చేసుకునే ఆత్మపరిశీలన కాలమన్నారు. ఉపవాసం ద్వారా నియమం, సహనం, క్రమశిక్షణ పెంపొందుతాయని, పేదల పట్ల కరుణాభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు.
CP Saichaitanya Iftar | దానధర్మాలు.. సహనశీలత..
దానధర్మాలు, సహనశీలత, సోదరభావం వంటి విలువలు ఈ పవిత్ర మాసంలో (Nizamabad Police) మరింత ఆవిష్కృతమవుతాయని చెప్పారు. అల్లాదయతో సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, సుఖసంతోషాలు నెలకొనాలని ఆకాంక్షించారు. అలాగే అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు సాగి నిజామాబాద్‌కు జిల్లా,రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్, టౌన్–2 ఎస్సై సయ్యద్ ముజాహిద్, జనరల్ సెక్రటరీ అబ్దుల్ మన్నన్, కార్పొరేటర్ అబ్దుల్ అందాన్, మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖుద్దూస్, ముస్లింలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Nizamabad Canal Car Accident | కెనాల్లో బోల్తాపడ్డ కారు.. ఇద్దరు మృతి

