Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Vijayawada Temple Theft | విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో భారీ చోరీ.. భక్తురాలి బ్యాగ్ నుంచి రూ.50 లక్షల బంగారం మాయం!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - Vijayawada Temple Theft | విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో భారీ చోరీ.. భక్తురాలి బ్యాగ్ నుంచి రూ.50 లక్షల బంగారం మాయం!

ఆంధ్రప్రదేశ్​తాజా వార్తలు

Vijayawada Temple Theft | విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో భారీ చోరీ.. భక్తురాలి బ్యాగ్ నుంచి రూ.50 లక్షల బంగారం మాయం!

విజయవాడలోని దుర్గమ్మ ఆలయంలో భారీ చోరీ జరిగింది. క్యూలైన్‌లో ఉన్న భక్తురాలి బ్యాగ్ నుంచి సుమారు రూ.50 లక్షల విలువైన బంగారం అపహరించబడింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టారు.

Naresh chandan
Last updated: మార్చి 7, 2026 9:05 ఉద.
Naresh chandan
3 వారాలు ago
Share
Vijayawada Temple Theft | విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో భారీ చోరీ.. భక్తురాలి బ్యాగ్ నుంచి రూ.50 లక్షల బంగారం మాయం!
Vijayawada Temple Theft | విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో భారీ చోరీ.. భక్తురాలి బ్యాగ్ నుంచి రూ.50 లక్షల బంగారం మాయం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijayawada Temple Theft | విజయవాడలోని Vijaywada ప్రసిద్ధ దుర్గమ్మ ఆలయంలో భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. క్యూలైన్‌లో ఉన్న ఓ భక్తురాలి బ్యాగ్ నుంచి సుమారు రూ.50 లక్షల విలువైన బంగారం దొంగిలించబడిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు విజయవాడ వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Contents
  • Vijayawada Temple Theft | మహా కుంభాభిషేక మహోత్సవాలు..
    • Vijayawada Temple Theft | భక్తుల ఆందోళన..

పోలీసుల వివరాల ప్రకారం, బాధితురాలు హైదరాబాద్‌కు చెందిన మహిళ. విజయవాడలో జరిగే ఓ పెళ్లికి హాజరుకావడానికి ఆమె నగరానికి వచ్చింది. అదే సమయంలో దుర్గమ్మను దర్శించుకుని తిరిగి హైదరాబాద్‌కు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఆలయంలోకి వెళ్లేందుకు క్యూలైన్‌లో నిలుచున్న సమయంలో ఆమె బ్యాగ్‌లో ఉన్న సుమారు రూ.50 లక్షల విలువైన బంగారం కనిపించకుండా పోయింది.

Vijayawada Temple Theft | మహా కుంభాభిషేక మహోత్సవాలు..

దుర్గమ్మ ఆలయంలో ప్రస్తుతం మహా కుంభాభిషేక మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ వేడుకల సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. క్యూలైన్‌లలో కూడా ఎక్కువ రద్దీ నెలకొంది. ఈ పరిస్థితిని ఉపయోగించుకున్న దొంగలు మహిళ బ్యాగ్‌ను లక్ష్యంగా చేసుకుని బంగారం చోరీ చేసినట్లు పోలీసులు Police అనుమానిస్తున్నారు.

అయితే దొంగను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. మహా కుంభాభిషేక మహోత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తుల కోసం అనేక చోట్ల టెంట్లు ఏర్పాటు చేశారు. ఈ టెంట్లు సీసీ కెమెరాలకు అడ్డుగా రావడంతో చోరీ జరిగిన దృశ్యాలు సరిగా రికార్డ్ కాలేదని సమాచారం. దీంతో నిందితులను గుర్తించడంలో పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.akshara kanaka

Vijayawada Temple Theft | భక్తుల ఆందోళన..

ప్రస్తుతం పోలీసులు ఆలయ పరిసరాల్లో ఉన్న ఇతర సీసీ కెమెరాల CC Cameras ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అలాగే చోరీ జరిగిన సమయంలో అక్కడ ఉన్న అనుమానాస్పద వ్యక్తులపై కూడా దృష్టి సారించారు. ఆలయానికి వచ్చిన భక్తుల వివరాలు సేకరించి, దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. ఈ ఘటనతో దుర్గమ్మ ఆలయానికి వచ్చిన భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భారీ రద్దీ సమయంలో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేయాలని వారు కోరుతున్నారు. పోలీసులు కూడా భక్తులు తమ వద్ద ఉన్న విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

Fuel Shortage India | ఇంధన యుద్ధం.. దేశంలో పెట్రోల్​–డీజిల్​ కొరత.. బంకుల్లో వాహనదారుల బారులు!
Nizamabad Congress Leader Murder | నిజామాబాద్​ జిల్లాలో కాంగ్రెస్​ నేత దారుణ హత్య!
Telangana Education Commission | పని చేస్తేనే పదోన్నతులు : తెలంగాణ విద్యా కమిషన్
March 10 Gold Silver Rates | స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
KTR Fitness Training | పొట్టను దాచిపెట్టడం విసుగొచ్చింది.. త్వరలోనే 50 లోకి అడుగు : కేటీఆర్​
TAGGED:andhra pradesh crime newsdurga temple vijayawadadurgamm temple newsgold theft from devotee in queue line at vijayawadagold theft indiaindia temple securitytemple theft newsvijayawada crime updateVijayawada Temple Theft
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article vedanta1 Vedanta Women Workforce | వేదాంత సంచలన నిర్ణయం: కార్యశాలలో మహిళా వాటా 35 శాతానికి పెంపు
Next Article LPG Price Hike | వంటింట్లో మంట.. డొమెస్టిక్​ LPG ధర రూ.60 పెంపు.. వాణిజ్య సిలిండర్ రూ.115 పెరుగుదల! LPG Price Hike | వంటింట్లో మంట.. డొమెస్టిక్​ LPG ధర రూ.60 పెంపు.. వాణిజ్య సిలిండర్ రూ.115 పెరుగుదల!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?