అక్షరటుడే, వెబ్డెస్క్: Maoists Surrender Revanth Reddy | అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులందరూ లొంగిపోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ (Command Control Center)లో సీఎం ఎదుట పెద్ద ఎత్తున మావోయిస్టులు ఆయుధాలతో లొంగిపోయారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ప్రభుత్వం ఎదుట పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. 130 మంది లొంగుబాటుకు అధికారులు విశేష కృషి చేశారన్నారు. ఇంకా అజ్ఞాతంలో ఉన్న వారు సైతం జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు.
Maoists Surrender Revanth Reddy | భద్రత కల్పిస్తాం..
అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోవాలని పిలుపునిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఆయన ఆరోగ్యానికి, ప్రాణానికి భరోసా కల్పిస్తామని హామీఇచ్చారు. ఈ విషయం గణపతికి సైతం చేరవేస్తామని పేర్కొన్నారు. ఆయుధాలతో ఎవరు లొంగిపోయిన వారికి ఆర్థిక, ఆరోగ్యో కల్పిస్తామని ప్రకటించారు. లొంగిపోయిన మావోయిస్టులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పారు. వారికి భూమి ఇచ్చే విషయంలో ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమన్నారు. మంచి ఆర్థికసాయం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. సొంత గ్రామాల్లో ఇళ్లు కట్టుకునేందుకు సాయం చేస్తామని చెప్పారు.
Maoists Surrender Revanth Reddy | కేసుల ఎత్తివేతపై సానుకూలంగా ఉన్నాం
లొంగిపోయిన మావోయిస్టులపై అవకాశం ఉన్న కేసులను ఎత్తివేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కేసుల ఎత్తివేతపై ప్రభుత్వ సానుకూలంగా ఉందని వెల్లడించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో సమస్యలను పరిష్కరించుకుందామన్నారు. శాంతియుత మార్గాల్లోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు.
Maoists Surrender Revanth Reddy | ఆపరేషన్ కగార్తో
మావోయిస్ట్ ఉద్యమం చివరి దశకు చేరింది. ఆపరేషన్ కగార్ (Operation Kagar)తో కకావికలం అయిన మావోలు లొంగుబాట పట్టారు. ఎన్కౌంటర్లలో వందల మంది హతం అవుతుండటం, కీలక నేతలు సైతం మృతి చెందుతుండడంతో ఉద్యమ బాట వీడాలని నిర్ణయించుకున్నారు. నంబాల కేశవరావు, హిడ్మా వంటి కీలక నేతలు చనిపోవడం, దేవ్జీ, రాజిరెడ్డి, ఆశన్న, మల్లోజుల వేణుగోపాల్ వంటి వారు ఆయుధాలు వీడడంతో మిగతా వారు సైతం సరెండర్ అవుతున్నారు. ఓ వైపు కేంద్ర బలగాలు దూసుకు వస్తుండడం, మరోవైపు కొత్తగా రిక్రూట్మెంట్లు లేకపోవడంతో నక్సల్స్ జన జీవన స్రవంతిలో కలుస్తున్నారు.
Not sure if the Maoists are surrendering with Will or by force,
But they should not stop standing for the people’s rights.
They should be welcomed to join Political Parties.
They should speak up on issues such as Khammam 1000 Families Houses Demolitions, on illegal Mining, on… pic.twitter.com/ukM7DITrti
— Dr.Krishank (@Krishank_BRS) March 7, 2026
ఇది కూడా చదవండి..: Revanth Reddy on Women Safety | మహిళల రక్షణకు చర్యలు : సీఎం రేవంత్రెడ్డి

