అక్షరటుడే, ఇందూరు: Kendriya Vidyalaya Recruitment | పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయం (PM SHRI Kendriya Vidyalaya) నిజామాబాద్ (Nizamabad), బోధన్‌లలో కాంట్రాక్ట్ పద్ధతిన ఉపాధ్యాయులను (Teacher Recruitment India) భర్తీ చేయనున్నారు. ఈ మేరకు శనివారం విద్యాలయం ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు ప్రకటన విడుదల చేశారు.
Kendriya Vidyalaya Recruitment | 9న వాక్ఇన్ ఇంటర్వ్యూ..
కాంట్రాక్ట్ పద్ధతిన ఆయా విద్యాలయాల్లో ఉపాధ్యాయుల నియామకానికి వాక్ ఇన్ ఇంటర్వ్యూ (Walk in Interview Jobs) నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈనెల 9న నిజామాబాద్ నగరంలోని పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయంలో ఉదయం 9గంటల నుంచి ఇంటర్వ్యూలు ఉంటాయని ఆయన తెలిపారు.
Kendriya Vidyalaya Recruitment | ఏయే సబ్జెక్టుల్లో..
ఆయా విద్యాలయాల్లో ప్రైమరీ టీచర్ (PRT), TGT (ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, గణితం, సైన్స్, సోషల్ సైన్స్), తెలుగు లాంగ్వేజ్ ఇన్‌స్ట్రక్టర్, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, ఏటీఎల్ ఇన్‌స్ట్రక్టర్ (ATL) , వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్, స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ నియామకాలు పూర్తి పారదర్శకంగా జరుగుతాయని, సీటీఈటీ (CTET Candidates) ఉత్తీర్ణులకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. అభ్యర్థులు ఉదయం 9 గంటల నుంచి (Nizamabad Education News) ఒరిజినల్ విద్యార్హతలు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోతో ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలు పాఠశాల వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

ఇది కూడా చదవండి: Revanth Reddy on Women Safety | మహిళల రక్షణకు చర్యలు : సీఎం రేవంత్‌రెడ్డి

