Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: ACB raids Tahsildar | తహశీల్దార్​ ఇంట్లో ఏసీబీ సోదాలు.. ఆస్తులు చూస్తే షాక్​ అవాల్సిందే?
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - ACB raids Tahsildar | తహశీల్దార్​ ఇంట్లో ఏసీబీ సోదాలు.. ఆస్తులు చూస్తే షాక్​ అవాల్సిందే?

తెలంగాణ

ACB raids Tahsildar | తహశీల్దార్​ ఇంట్లో ఏసీబీ సోదాలు.. ఆస్తులు చూస్తే షాక్​ అవాల్సిందే?

సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహశీల్దార్ శ్రవణ్ కుమార్​ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. భారీగా అక్రమాస్తులు గుర్తించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 7, 2026 6:27 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
ACB raids Tahsildar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB raids Tahsildar | కొందరు ప్రభుత్వ ఉద్యోగులు లంచాల పేరిట ప్రజలను పట్టి పీడిస్తున్నారు. అందిన కాడికి దండుకొని భారీగా అక్రమాస్తులు కూడబెడుతున్నారు. ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నా.. లంచాలకు మరిగిన అధికారుల తీరు మారడం లేదు.

Contents
  • ACB raids Tahsildar | రూ.4 కోట్ల ఆస్తులు
    • ACB raids Tahsildar | అధికార దుర్వినియోగం
      • ACB raids Tahsildar | లంచం ఇవ్వొద్దు

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల తహశీల్దార్ (Gajwel Tahasildar) కమతం శ్రవణ్ కుమార్​ ఇంటిపై శనివారం ఏసీబీ దాడులు చేసింది. అక్రమాస్తుల కేసు నమోదు కావడంతో అధికారులు తహశీల్దార్​ ఇంటితో పాటు మరో రెండు చోట్ల ఏకకాలంలో సోదాలు చేశారు. శ్రవణ్ కుమార్ తన సర్వీసు కాలంలో చట్టవిరుద్ధమైన పద్ధతులు, అక్రమ మార్గాల ద్వారా ఆస్తులను సంపాదించారనే ఆరోపణలపై కేసు నమోదు అయింది.

ACB raids Tahsildar | రూ.4 కోట్ల ఆస్తులు

నిందితుడి ఇంట్లో, మరో 2 ప్రదేశాలలో అధికారులు సోదాలు చేశారు. అతడికి రెండు ఇళ్లు, ఆరు ఫ్లాట్లు ఉన్న ఒక అపార్ట్​మెంట్, కరీంనగర్​ (Karimnagar) నగరంలో నాలుగు ఓపెన్​ ప్లాట్లు, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక కారు ఉన్నట్లు గుర్తించారు. రూ. 4,20,000 విలువైన బంగారు ఆభరణాలు, రూ. 15,66,000 విలువైన గృహోపకరణాలు, రూ. 11,90,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.4 కోట్ల విలువైన అక్రమాస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ACB raids Tahsildar | అధికార దుర్వినియోగం

తహశీల్దార్​ శ్రవణ్​కుమార్​ తన అధికారాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా ఈ స్థిర, చరాస్తులను సంపాదించాడని సోదాల్లో అధికారులు గుర్తించారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఆయా ఆస్తుల విలువ మార్కెట్ విలువ అధికారిక విలువ కంటే చాలా ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించారు.

acb

ACB raids Tahsildar | లంచం ఇవ్వొద్దు

ప్రభుత్వ అధికారులు, సిబ్బంది లంచం అడిగితే ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు కోరుతున్నారు. వస్తువులు, బహుమతుల రూపంలో అడిగినా.. తమకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. టోల్​ ఫ్రీ నంబర్​ 1064, ఏసీబీ వెబ్​సైట్​ (ACB Website) ద్వారా ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

ACB has registered a Disproportionate Assets case against Kamatam Sravan Kumar, Tahsildar of Gajwel Mandal, Siddipet district

Searches at his residence and two other locations reportedly revealed assets worth around ₹4 crore, including:

• 2 houses
• 1 apartment with 6 flats… pic.twitter.com/OLvGPbGoxC

— Naveena (@TheNaveena) March 7, 2026

దీనిని కూడా చదవండి : ACB Bribery Arrest | పోస్టుమార్టం రిపోర్ట్​ కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన హోంగార్డు

Hyderabad Land Allotment | ఎంపీ మల్లు రవి భార్యకు రూ.8 కోట్లు విలువ చేసే భూమి ధారాదత్తం!
land acquisition protest | పేదల భూములను గుంజుకుంటే చూస్తూ ఊరుకోం : ఎంపీ ఈటల
Telangana Assembly Clash | అసెంబ్లీలో ఇప్పసారా రగడ.. మంత్రి పొన్నం – ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి మాటల యుద్ధం!
Licensed Surveyors Wages | వేతనాలు లేక అవస్థలు.. కేటీఆర్‌ను కలిసిన లైసెన్స్‌డ్ సర్వేయర్లు
Kavitha Slams Revanth | సీఎం రేవంత్​రెడ్డిపై కవిత ఆగ్రహం
TAGGED:ACB raidsGajwel tahsildar caseillegal assets caseSiddipet newsTahsildar corruptionTelangana ACB
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Kendriya Vidyalaya Recruitment | Kendriya Vidyalaya Recruitment | కేంద్రీయ విద్యాలయాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉపాధ్యాయుల భర్తీకి ఇంటర్వ్యూలు
Next Article TU South Campus | TU South Campus | ర్యాగింగ్ ఘటనపై కమిటీ వేశాం : సౌత్ క్యాంపస్ ప్రిన్సిపాల్ సుధాకర్ గౌడ్
4 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?