అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Housing Board registrations | మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) కీలక ప్రకటన చేశారు. హౌసింగ్ బోర్డు పరిధిలో పెండింగ్లో ఉన్న 5 వేల రిజిస్ట్రేషన్లను ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో క్లియర్ చేస్తామన్నారు.
పారదర్శకంగా వేగవంతమైన సేవల కోసం హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ప్రత్యేక రిజిస్ట్రేషన్ పోర్టల్ (Registration Portal)ను మంత్రి పొంగులేటి శనివారం ప్రారంభించారు. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో హౌసింగ్ బోర్డు రిజిస్ట్రేషన్ పోర్టల్ ప్రారంభించడంతో పాటు హౌసింగ్ కార్పొరేషన్ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన పోస్టర్ కూడా ఆయన ఆవిష్కరించారు.
Housing Board registrations | వివాదం ఏమిటంటే..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో వెంచర్లు వేశారు. అందులో అనేక మంది ప్లాట్లు కొనుగోలు చేశారు. అయితే వెంచర్లను అభివృద్ధి చేయడంతో పలు సంస్థలు ఆలస్యం చేశాయి. దీంతో ఆయా సంస్థల్లో రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం నిషేధం విధించింది. 2007 నుంచి ఈ సమస్య పెండింగ్లో ఉంది. బీఆర్ఎస్ హయాంలో దీనిపై సబ్ కమిటీ వేసినా రిజిస్ట్రేషన్లపై అడుగు ముందుకు పడలేదు. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్లకు ఓకే చెప్పడంతో ప్లాట్లు కొన్నవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Housing Board registrations | అంకిత భావంతో పని చేయాలి
ప్రజలకు వేగవంతమైన పారదర్శక సేవలను అందించడంపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందని మంత్రి అన్నారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలోని కార్యక్రమాలను అధికారులు విజయవంతం చేసేందుకు అంకిత భావంతో పని చేయాలని ఆదేశించారు. హౌసింగ్ బోర్డు పరిధిలో ఇళ్లు, ప్లాట్లు, స్థలాలను వాయిదా పద్ధతిలో కొనుగోలు చేసి వివిధ కారణాలతో రిజిస్ట్రేషన్ ఆగిపోయిన 5 వేల మందికి అసలు, వడ్డీ, ప్రస్తుత మార్కెట్ ధరల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశించారు.
కేటాయింపుదారులు అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పోర్టల్లోనే తమ రిజిస్ట్రేషన్, చెల్లింపుల ధృవీకరణ, ఇతర లావాదేవీలను చెక్ చేసుకోవచ్చని మంత్రి వెల్లడించారు. ఇది హౌసింగ్ బోర్డు, అలాటీల మధ్య నమ్మకాన్ని బలోపేతం చేస్తుందన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకొని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రజలకు సౌకర్యవంతమైన పాలన అందించడానికి ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తుందని పొంగులేటి పేర్కొన్నారు.
దీనిని కూడా చదవండి : Revanth Reddy on Women Safety | మహిళల రక్షణకు చర్యలు : సీఎం రేవంత్‌రెడ్డి

