అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Sisters Death | కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్బినగర్ కాలనీకి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్ళ అదృశ్యమైన ఘటన విషాదాన్ని నింపింది. ఈ చిన్నారులు కామారెడ్డి చెరువులో విగతజీవులుగా మారారు. ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో చిన్నారి మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Kamareddy Sisters Death | తినుబండారాలు కొనిస్తానని..
ఆర్బినగర్ కాలనీకి చెందిన అక్కాచెల్లెళ్ళు సిపాత్ (08), ఆయాత్(07), మరియం(05) శనివారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో కిరాణా షాపులో తినుబండారాలు కొనుగోలు చేసేందుకు తండ్రితో కలిసి వెళ్లారు. తిరిగి ఇంటికి రాలేదు. చిన్నారుల తల్లి తన భర్తకు ఫోన్ చేసి పిల్లలు ఇంకా రాలేదని చెప్పడంతో.. తాను దుకాణం వద్ద వదిలి వెళ్లినట్లు చెప్పుకొచ్చాడు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో మూడు బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా గాలించారు. కాగా, కామారెడ్డి పెద్ద చెరువులో ఆయాత్, మరియం మృతదేహాలు లభ్యమయ్యాయి. పెద్దమ్మాయి సిపాత్ మృతదేహం కోసం గాలిస్తున్నారు. పోలీసుల విచారణలో కన్నతండ్రే కూతుళ్ళను చెరువులో తోసి హత్యకు పాల్పడినట్టు తేలిందని సమాచారం.
చిన్నారుల మృతదేహాలను చూసిన కన్నతల్లి బోరున విలపించింది. అక్కాచెల్లెళ్ల మృతదేహాలు కామారెడ్డి చెరువులో లభించాయని తెలియడంతో ఆ ప్రాంతం వద్దకు ప్రజలు పెద్దఎత్తున చేరుకున్నారు.
ఇది కూడా చదవండి: Kamareddy Missing Children | ఐదుగురు చిన్నారుల అదృశ్యం.. కామారెడ్డి పట్టణంలో ఘటన

