Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: T20 World Cup Final | టీ20 ప్రపంచకప్ ఫైనల్ నేడు.. భారత్-న్యూజిలాండ్ మ‌ధ్య టైటిల్ పోరు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రీడలు - T20 World Cup Final | టీ20 ప్రపంచకప్ ఫైనల్ నేడు.. భారత్-న్యూజిలాండ్ మ‌ధ్య టైటిల్ పోరు

క్రీడలు

T20 World Cup Final | టీ20 ప్రపంచకప్ ఫైనల్ నేడు.. భారత్-న్యూజిలాండ్ మ‌ధ్య టైటిల్ పోరు

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్ నేడు భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. వరుసగా రెండోసారి టైటిల్ గెలవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకోగా, తమ తొలి టీ20 ప్రపంచకప్ కోసం కివీస్ జట్టు పోరాడనుంది.

Srinivas kolluri
Last updated: మార్చి 8, 2026 10:17 ఉద.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
T20 World Cup Final

అక్షరటుడే, వెబ్​డెస్క్: T20 World Cup Final | ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ మెన్స్ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైనల్ మ్యాచ్ నేడు జరగనుంది. టైటిల్ కోసం టీమిండియా, న్యూజిలాండ్ (New Zealand) జట్లు తలపడనున్నాయి.

Contents
  • T20 World Cup Final | భారత జట్టు బలాలు
      • T20 World Cup Final | కివీస్​ జట్టులో..

అహ్మదాబాద్​లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో నేడు రాత్రి 7 గంటలకు ఈ హై వోల్టేజ్ మ్యాచ్ (T20 World Cup Final) ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌పై ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్ మరోసారి టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే టీ20 ప్రపంచకప్ చరిత్రలో వరుసగా రెండుసార్లు టైటిల్ గెలిచిన తొలి జట్టుగా నిలుస్తుంది. అలాగే మొత్తం మూడు సార్లు ట్రోఫీ సాధించిన ఏకైక జట్టుగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది.

T20 World Cup Final | భారత జట్టు బలాలు

న్యూజిలాండ్ జట్టు తమ తొలి టీ20 ప్రపంచకప్ టైటిల్ కోసం పోరాడుతోంది. సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకున్న కివీస్ జట్టు ఈసారి చరిత్ర సృష్టించాలని చూస్తోంది. భారత జట్టులో పలువురు ఆటగాళ్లు అద్భుత ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా సంజూ శాంస‌న్ గత రెండు మ్యాచ్‌ల్లో 97 నాటౌట్, 89 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. టాప్ ఆర్డర్‌లో ఇషాన్ కిష‌న్, సూర్య కుమార్ యాద‌వ్ (Suryakumar Yadav) వంటి బ్యాటర్లు జట్టుకు బలంగా నిలుస్తున్నారు.

బౌలింగ్ విభాగంలో జ‌స్ప్రీత్ బుమ్రా Jasprit Bumrah ఈ టోర్నీలో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేస్తూ కీలక వికెట్లు తీస్తున్నాడు. అతని ఎకానమీ రేట్ 6.63గా ఉంది. సెమీఫైనల్‌లో చివరి ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్‌ను ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక స్పిన్ విభాగంలో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి (Varun Chakravarthy) 13 వికెట్లతో టోర్నీలో టాప్ వికెట్ టేకర్లలో ఒకడిగా నిలిచాడు. అహ్మదాబాద్ పిచ్ స్పిన్నర్లకు సహకరించే అవకాశం ఉండటంతో అతని పాత్ర కీలకంగా మారే అవకాశం ఉంది.

T20 World Cup Final | కివీస్​ జట్టులో..

కివీస్ జట్టులో కూడా పలువురు మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ముఖ్యంగా అల్లెన్ (Finn Allen) సెమీఫైనల్‌లో 33 బంతుల్లోనే శతకం బాది చరిత్ర సృష్టించాడు. అతనిని త్వరగా అవుట్ చేయడం భారత్‌కు అత్యంత కీలకం. అలాగే ఆల్‌రౌండర్ ర‌చిన్ ర‌వీంద్ర‌, కెప్టెన్ శాంట్న‌ర్ (Mitchell Santner) కూడా బ్యాటింగ్, బౌలింగ్‌లో జట్టుకు బలంగా నిలుస్తున్నారు. అహ్మదాబాద్‌లోని పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ టోర్నీలో ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యాయి. అయితే రాత్రి మ్యాచ్‌లలో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు ఎక్కువ విజయాలు సాధించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం 13 మ్యాచ్‌లలో 8 మ్యాచ్‌ల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచాయి. అందువల్ల టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ కొంత నెమ్మదించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు భారత్ న్యూజిలాండ్‌ను ఓడించలేదు. ఈ రెండు జట్లు ఎదురెదురుగా తలపడిన మూడు మ్యాచ్‌ల్లోనూ కివీస్ జట్టు విజయం సాధించింది.

ఇది కూడా చదవండి : T20 World Cup Final | వరల్డ్ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ తో ఫైట్.. పాత ట్రెండ్‌ని బ‌ట్టి ప్రపంచకప్ విజేతగా భారత్.. ?

India vs New Zealand Final | భారత్ vs న్యూజిలాండ్: T20 వరల్డ్ కప్ ఫైనల్‌లో టాస్ అత్యంత కీలకం..
T20 World Cup 2026 Semifinal Rain | సెమీఫైనల్స్‌కి వర్షం ముప్పు ఉందా.. మ్యాచ్ రద్దైతే ఫైనల్‌కి ఎవరు?
GVCC Cricket Championship | 3వ జీవీసీసీ క్రికెట్ ఛాంపియన్‌షిప్.. ఆర్కిటెక్ట్‌లు డిజైనర్ల కలయిక
Narendra Modi Stadium Water Price | దొరికిన కాడికి దోపిడి.. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో నీళ్ల బాటిల్‌ రూ.200.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు వచ్చిన అభిమానులకు చుక్కలు
T20 World Cup 2026 | టీ20 వరల్డ్‌కప్‌లో చరిత్ర సృష్టించిన‌ భారత్.. న‌మోదైన రికార్డులు ఇవే..!
TAGGED:ICC T20 World Cup 2026india vs new zealandnarendra modi stadiumnew zealand cricket teamT20 World Cup Finalteam india cricket
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Gold Silver Rates Today Gold Silver Rates Today | భగ్గుమంటున్న పసిడి ధరలు.. ఆదివారం గోల్డ్, సిల్వర్ రేట్లు ఇలా ఉన్నాయి!
Next Article Travels Bus Smoke Travels Bus Smoke | ట్రావెల్స్ బస్సులో పొగలు.. భయంతో ప‌రుగులు తీసిన ప్రయాణికులు
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?