Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Travels Bus Smoke | ట్రావెల్స్ బస్సులో పొగలు.. భయంతో ప‌రుగులు తీసిన ప్రయాణికులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Travels Bus Smoke | ట్రావెల్స్ బస్సులో పొగలు.. భయంతో ప‌రుగులు తీసిన ప్రయాణికులు

తెలంగాణ

Travels Bus Smoke | ట్రావెల్స్ బస్సులో పొగలు.. భయంతో ప‌రుగులు తీసిన ప్రయాణికులు

యాదాద్రి భువనగిరి జిల్లాలోని పంతంగి టోల్‌గేట్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Srinivas kolluri
Last updated: మార్చి 8, 2026 10:38 ఉద.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Travels Bus Smoke

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Travels Bus Smoke | యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలో ఆదివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ నుంచి చెన్నైకి (Chennai) వెళ్తున్న కావేరి ట్రావెల్స్‌ (Kaveri Travels)కు చెందిన ప్రైవేట్ బస్సులో అకస్మాత్తుగా ఇంజిన్ నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్‌గేట్ సమీపంలో, హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.

హైదరాబాద్ (Hyderabad) నుంచి చెన్నై వైపు బయలుదేరిన బస్సు పంతంగి టోల్‌గేట్ దగ్గరికి రాగానే ఇంజిన్ భాగం నుంచి స్వల్పంగా పొగలు రావడం ప్రారంభమైంది. మొదట్లో చిన్నగా కనిపించిన ఈ పొగలు క్రమంగా పెరగడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే కొందరు ప్రయాణికులు డ్రైవర్‌కు ఈ విషయం తెలియజేయగా, డ్రైవర్ బస్సును రోడ్డుపక్కన ఆపాడు.

Travels Bus Smoke | భ‌య‌ప‌డిన ప్రయాణికులు

అప్పటికే భయంతో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా బస్సు నుంచి దిగిపోయారు. మహిళలు, పిల్లలతో పాటు అందరూ రోడ్డుపైకి వచ్చి నిలబడ్డారు. గతంలో జరిగిన బస్సు అగ్నిప్రమాదాలు గుర్తుకు రావడంతో కొంతమంది ప్రయాణికులు తీవ్రంగా భయపడ్డారు. ట్రావెల్స్ యాజమాన్యాన్ని సంప్రదించి సమస్యపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో కొంతసేపు పంతంగి టోల్‌గేట్ వద్ద హైవేపై ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రయాణికులు తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, సమస్య ఉన్న బస్సులో మళ్లీ ప్రయాణించబోమని స్పష్టం చేశారు. ట్రావెల్స్ య‌జ‌మాని మ‌రో ఖాళీ బ‌స్సు పంపించ‌డంతో తిరుగు ప్ర‌యాణం అయ్యారు.

దీనిని కూడా చదవండి : Hyderabad Building Collapse | హైదరాబాద్​లో ఘోర ప్రమాదం.. భవనం కూలి నలుగురు దుర్మరణం

Hyderabad Pollution Free | కాలుష్య రహితంగా హైదరాబాద్​ : సీఎం రేవంత్​రెడ్డి
Intermediate exam fear | ఇంటర్​లో ఫెయిల్​ అవుతాననే భయంతో విద్యార్థి ఆత్మహత్య
Telangana Heavy Rains | రైతులకు అలెర్ట్​.. రాష్ట్రానికి భారీ వర్ష సూచన
Ranikhet Disease | కొక్కెర వ్యాధితో వేలాది కోళ్ల మృతి
Excise Constable Transfers | త్వరలో ఎక్సైజ్​ కానిస్టేబుళ్ల బదిలీలు : మంత్రి జూపల్లి
TAGGED:bus smoke newshyderabad chennai buspantangi tollgate newspassenger safety newstelangana highway incidenttravels bus incident
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article T20 World Cup Final T20 World Cup Final | టీ20 ప్రపంచకప్ ఫైనల్ నేడు.. భారత్-న్యూజిలాండ్ మ‌ధ్య టైటిల్ పోరు
Next Article akshara sisters Kamareddy Sisters Death | కన్నతండ్రి కర్కశత్వం.. పెంచి పోషించలేకనే కూతుళ్ల హత్య
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?