అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Sisters Death | అభం.. శుభం తెలియని చిన్నారులపై ఆ తండ్రి కర్కశత్వం చూపాడు.. జాలిదయ లేకుండా తను కన్న కూతుళ్లేనని మరిచి దారుణంగా హత్య చేశాడు. అప్పులు లేకున్నా కుటుంబ పోషణ భారంగా మారడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు.
Kamareddy Sisters Death | ఆటో డ్రైవర్ తండ్రి.. ఇళ్లలో పనిచేసే తల్లి..
ఆటో డ్రైవర్‌గా పని చేసే తండ్రి.. పలువురి ఇళ్లలో పని చేసే తల్లి.. అప్పులు లేకున్నా కుటుంబ పోషణ మాత్రం ఆ తల్లిదండ్రులకు భారంగా మారింది. ఈ క్రమంలో వీరికి ముగ్గురు కూడా ఆడపిల్లలే కావడంతో ఆ తండ్రి ఘోరమైన నిర్ణయం తీసుకున్నాడు. పిల్లలను పోషించే స్థోమత లేని ఆ తండ్రి పిల్లల భారం వదిలించుకోవాలనుకున్నాడు. శనివారం తన పిల్లలను తీసుకుని కామారెడ్డి పెద్ద చెరువు(Kamareddy Pedda cheruvu) వద్దకు తీసుకెళ్లి చెరువులో తోసి హత్య చేసి ఏమీ తెలియనట్టుగా తన పిల్లలు కనిపించడం లేదని నటిస్తూ భార్యతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాయంత్రం తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రాత్రి వరకే కేసును కొలిక్కి తీసుకొచ్చారు. ఆ తండ్రి ఆట కట్టించారు.
Kamareddy Sisters Death | కామారెడ్డి పట్టణంలో..
కామారెడ్డి పట్టణంలోని (Kamareddy City) ఆర్బీ నగర్ కాలనీకి చెందిన సబీనా ఇస్మాయిల్ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు సిపాత్(8), అయాత్ (7), మరియం(5) ఉన్నారు. తండ్రి ఇస్మాయిల్ ఆటో డ్రైవర్‌గా పని చేస్తుండగా తల్లి సబీనా పలు ఇళ్లలో పనికి వెళ్తోంది. ముగ్గురు కూతుళ్లను పోషించలేని తండ్రి వారి అడ్డు తొలగించుకోవాలని భావించాడు. పథకం ప్రకారం ముగ్గురు పిల్లలను తీసుకుని కిరాణా షాపులో వారికి తినడానికి కావాల్సినవి కొనిచ్చాడు. తర్వాత ఇంటికి వెళ్లమని చెప్పి తిరిగి వచ్చి ఆటోలో ముగ్గురు పిల్లలను ఎక్కించుకుని కామారెడ్డి చెరువు (kamareddy pond incident) వద్దకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. అనుకున్న విధంగానే పిల్లల్ని హతమార్చాలని భావించిన ఇస్మాయిల్ ముగ్గురిని చెరువులోకి తోసేసి అక్కడినుంచి వెళ్లిపోయాడు.
Kamareddy Sisters Death | సాయంత్రం అయినా పిల్లలు రాకపోయేసరికి..
సాయంత్రం అయినా పిల్లలు రాకపోయేసరికి తల్లి సబీనా ఇస్మాయిల్‌కు ఫోన్ చేయగా కిరాణా షాప్ వద్ద కావాల్సినవి కొనుక్కుని ఇంటికి వెళ్లారని, తాను ఆటో తీసుకుని పాత బస్టాండ్ వెళ్లిపోయానని నమ్మించాడు. సబీనాకు అనుమానం రాకుండా ఉండేందుకు ఇంటికి వచ్చిన ఇస్మాయిల్ పిల్లలను చుట్టుపక్కల వెతికారు. చివరికి పిల్లలు కనిపించడం లేదంటూ పోలీసులకు (india crime news) ఫిర్యాదు చేశారు. దాంతో కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. సీసీ కెమెరాలో పిల్లలు ఆటో ఎక్కినట్లుగా పోలీసులు(auto driver murder case) గుర్తించినట్లుగా తెలుస్తోంది.
పోలీసుల అదుపులో ఇస్మాయిల్..
దాంతో పోలీసులు ఇస్మాయిల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా పిల్లలను చెరువులో తోసి హత్య చేసినట్లుగా తేలింది. దాంతో ఏఎస్పీ చైతన్య రెడ్డి (ASP Chaitanya Reddy) ఆధ్వర్యంలో పోలీసులు చెరువులో మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి 11 గంటలవరకు అయాత్, మరియం మృతదేహాలు లభ్యం కాగా సిపాత్ మృతదేహం లభ్యం కాలేదు. అయినా అర్ధరాత్రి వరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా రాత్రి 12 గంటల తర్వాత సిపాత్ మృతదేహం కూడా లభ్యమైంది. ముగ్గురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. ఉదయం ఇంటినుంచి బయటకు వెళ్లిన చిన్నారులు రాత్రి వరకు విగత జీవులు ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

ఇది కూడా చదవండి: Travels Bus Smoke | ట్రావెల్స్ బస్సులో పొగలు.. భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు

