Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Bride Elopes Wedding | పెళ్లిపీటల నుంచి లేచి.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - Bride Elopes Wedding | పెళ్లిపీటల నుంచి లేచి.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు

ఆంధ్రప్రదేశ్​

Bride Elopes Wedding | పెళ్లిపీటల నుంచి లేచి.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు

ముహూర్తం సమయానికి పెళ్లి మండపం సందడిగా ఉండగా అనూహ్యంగా చోటుచేసుకున్న ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. జీలకర్ర బెల్లం కార్యక్రమం పూర్తైన కొన్ని క్షణాల్లోనే వధువు తన ప్రియుడితో వెళ్లిపోవడంతో వివాహ వేడుక ఒక్కసారిగా గందరగోళంగా మారింది.

Srinivas kolluri
Last updated: మార్చి 8, 2026 11:13 ఉద.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Bride Elopes Wedding

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bride Elopes Wedding | ఎన్టీఆర్​ జిల్లా (NTR District) మైలవరంలో (Mailavaram) ఓ వివాహ వేడుకలో చోటు చేసుకున్న అనూహ్య ఘటన పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. బంధుమిత్రులు, గ్రామస్తుల సమక్షంలో ఘనంగా జరుగుతున్న పెళ్లి వేడుకలో మాంగల్యధారణకు క్షణాల ముందు వధువు తన ప్రియుడితో వెళ్లిపోవడం కలకలం రేపింది. స్థానిక సమాచారం ప్రకారం, మైలవరానికి చెందిన ఓ యువతి వివాహం కుటుంబ సభ్యులు నిర్ణయించిన వరుడితో ఘనంగా జరుగుతోంది. పెళ్లి మండపం వద్ద బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున హాజరై వివాహ వేడుకలో పాల్గొన్నారు. ముహూర్తం సమయం దగ్గరపడడంతో సంప్రదాయ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వధూవరులు ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుని కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

Contents
  • Bride Elopes Wedding | అంద‌రి ముందే ప్ర‌క‌ట‌న‌..
    • Bride Elopes Wedding | యువకుడిపై దాడి

Bride Elopes Wedding | అంద‌రి ముందే ప్ర‌క‌ట‌న‌..

ఇదే సమయంలో అనూహ్యంగా ఓ యువకుడు మండపం వద్దకు వచ్చాడు. అతడిని చూసిన వెంటనే వధువు పీటలపై నుంచి లేచి అతడి దగ్గరకు వెళ్లింది. “వచ్చావా?” అంటూ అతడితో మాట్లాడిన ఆమె, అందరి ముందు అతడే తన ప్రేమికుడని ప్రకటించింది. “ఇతను మా ఊరివాడే.. మేమిద్దరం చాలా కాలంగా ప్రేమించుకుంటున్నాం” అని చెప్పడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వరుడు, అతడి కుటుంబ సభ్యులు ఏమి జరుగుతోందో అర్థం కాక నిశ్చేష్టులయ్యారు.

bride

Bride Elopes Wedding | యువకుడిపై దాడి

ఈ పరిణామంతో వరుడి తరఫు బంధువులు ఆగ్రహానికి గురయ్యారు. పెళ్లి మండపానికి వచ్చిన ఆ యువకుడిపై కొందరు చేయి చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి అదుపు తప్పే అవకాశముండడంతో సమాచారం అందుకున్న పోలీసులు (Police) అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఇక వరుడి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ కొడుకు పెళ్లి కోసం దాదాపు రూ.20 లక్షల వరకు ఖర్చు చేశామని, చివరి నిమిషంలో ఇలా జరిగి తమ కుటుంబ పరువు పోయిందని వాపోయారు.

పెళ్లి ఆగిపోవడంతో రెండు కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. చివరకు గ్రామ పెద్దల సమక్షంలో ఇరువర్గాలు పంచాయితీ నిర్వహించుకుని విషయాన్ని చర్చించుకున్నాయి. పరిస్థితి సమ‌సిపోయేలా గ్రామ పెద్దలు మధ్యవర్తిత్వం వహించినట్లు తెలుస్తోంది. మాంగల్యధారణకు క్షణాల ముందు వధువు తన ప్రియుడితో వెళ్లిపోవడం మైలవరం ప్రాంతంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన గురించి గ్రామస్థులు, స్థానికులు ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు.

ఇది కూడా చదవండి : AbhiBus Seat Issue | సీటు తప్పుగా కేటాయించిన ట్రావెల్​ సంస్థ.. అభిబస్​కు రూ. 30 వేల జరిమానా!

Vizianagaram Bus Fire | విజయనగరం జిల్లాలో ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం.. ప్ర‌యాణికుల్లో ఎంఎల్ఏ కూడా ఉన్నారా..!
Students Drowned | గోదావరిలో ఐదుగురు విద్యార్థుల గల్లంతు
Chandrababu Tirumala visit | కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
Vijay Rashmika Reception | ఘనంగా విరోష్​ రిసిప్షన్​ వేడుక.. హాజరైన ప్రముఖులు..
bribery case | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వార్డు కార్యదర్శి
TAGGED:Andhra Pradesh Newsbride elopes with loverbride runs awayindian wedding dramamailavaram wedding incidentviral wedding storywedding controversy india
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article akshara sisters Kamareddy Sisters Death | కన్నతండ్రి కర్కశత్వం.. పెంచి పోషించలేకనే కూతుళ్ల హత్య
Next Article Israel Iran Attacks Israel Iran Attacks | ఇరాన్​ ఆయిల్ డిపోలపై ఇజ్రాయెల్ దాడులు
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?