అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bahrain US Fleet | పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరం అవుతోంది. ఉద్రిక్త పరిస్థితులు ఏమాత్రం చల్లారడంలేదు. ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికాలు దాడులు చేస్తుండగా.. ఇరాన్ ప్రతిదాడులకు దిగుతోంది.
ఇరాన్ తాజాగా బహ్రెయిన్‌లోని అమెరికా నౌకాదళం ఫిఫ్త్ ఫ్లీట్ ప్రధాన కేంద్రంపై దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో 21 మంది అమెరికన్ సైనికులు మృతి చెందినట్లుగా ఇరాన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దాడి జరిగిన ప్రాంతంలో మంటలు చెలరేగుతున్న వీడియోలు విడుదల చేశాయి.
Bahrain US Fleet | ప్రతీకార దాడులు
ఇరాన్ తన దాడిని అమెరికా-ఇజ్రాయిల్‌లు చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’కి బదులుగా అభివర్ణించింది. మార్చి 6న అమెరికా సబ్‌మెరైన్ ఇరాన్ యుద్ధనౌకను శ్రీలంక సమీపంలో టార్పెడోతో ధ్వంసం చేయడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగిన విషయం తెలిసిందే. కాగా.. దాడిని పాట్రియట్ PAC-3 రక్షణ వ్యవస్థలు అడ్డుకోలేకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Bahrain US Fleet | కీలకమైన ఫ్లీట్
బహ్రెయిన్‌లోని అమెరికా నౌకాదళం ఫిఫ్త్ ఫ్లీట్ పర్షియన్ గల్ఫ్, ఎర్ర సముద్రం, అరేబియా సముద్రంలో 25 లక్షల చదరపు మైళ్లను నియంత్రిస్తుంది. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి ద్వారా సరఫరాలకు భద్రత కల్పిస్తుంది. 47 దేశాల సంయుక్త సముద్ర దళాలు కలిగిన ఈ ఫ్లీట్‌లో 8,300 మంది నావికులు పని చేస్తున్నట్లు సమాచారం. తాజాగా జరిగిన ఈ దాడి ప్రపంచ వాణిజ్యం, ప్రాంతీయ భద్రతపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. అయితే ఈ ఘటనతో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఎలా మారతాయనేది కలవరపాటుకు గురిచేస్తోంది.
ఇది కూడా చదవండి..: Israel Iran Attacks | ఇరాన్ ఆయిల్ డిపోలపై ఇజ్రాయెల్ దాడులు

