భీమ్గల్, అక్షరటుడే: Tribal Association Support | కష్టాల్లో ఉన్న గిరిజన కుటుంబానికి (tribal welfare support) తామున్నామంటూ ‘ఆల్ ఇండియా గిరిజన సేవా సంఘం’ (Girijan seva sangham) మానవత్వాన్ని చాటుకుంది. మండల కేంద్రంలో(Bheemgal Municipality) డయాలసిస్ వ్యాధితో పోరాడుతూ ఇటీవల మరణించిన కుప్పకంటి (social service india) గ్రామానికి చెందిన మూడవత్ హంస కుటుంబాన్ని సంఘం సభ్యులు ఆదివారం పరామర్శించారు. తల్లి మరణంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న నలుగురు చిన్నారులను చూసి చలించిపోయిన సంఘం నేతలు, వారికి తక్షణ సాయం అందించి భరోసా కల్పించారు.
Tribal Association Support | కన్నీటి పర్యంతమైన కుటుంబం..
కుప్పకంటికి చెందిన మూడవత్ నక్కన్న భార్య హంస మరణం ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడి బాధ్యత ఇప్పుడు నక్కన్నపై పడింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న (Aid for orphan children) గిరిజన సేవా సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీకాంత్ రామావత్, అధ్యక్షుడు కుర్తిలాల్ వెంటనే స్పందించారు.
Tribal Association Support | అండగా నిలిచి.. ధైర్యం చెప్పి..
సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం భీమ్గల్ (Bheemgal) మండలంలోని గ్రామాన్ని సందర్శించిన సభ్యులు (humanitarian support india), బాధిత కుటుంబానికి తక్షణ ఖర్చుల నిమిత్తం రూ.1000 నగదుతో పాటు నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను (rural social service) అందజేశారు. గిరిజన బిడ్డలకు ఏ కష్టం వచ్చినా తమ సంఘం ముందుండి పోరాడుతుందని శ్రీకాంత్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. గిరిజన సమాజంలోని పేదరికం, ఆరోగ్య సమస్యల నిర్మూలనే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు రామావత్ వెంకటేష్, సర్పంచ్ స్వామి, సంఘం సభ్యులు సవీన్, తిరుపతి, గణేష్, వసంధర్ తదితరులు పాల్గొన్నారు.

