అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Krishna River Water | కృష్ణా నదీ జలాల్లో ఒక్క చుక్క నీరు కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు. మన వాటా ప్రకారం కృష్ణా నదీ జలాలను సంపూర్ణంగా వినియోగించుకుంటామని స్పష్టం చేశారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ (Mahabubnagar) ప్రాజెక్ట్‌లపై ఆదివారం మంత్రి ఉత్తమ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా ప్రాజెక్టుల పురోగతిపై జలసౌధలో అధికారులతో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ (Nalgonda) జిల్లా నీటి అవసరాల కోసం న్యాయ పోరాటం చేస్తామని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే కృష్ణా బేసిన్లో ఎక్కువ పంటలు సాగు అవుతున్నాయన్నారు.
Krishna River Water | నిధులు కేటాయిస్తాం
రాష్ట్రంలోని పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌ల భూ సేకరణ కోసం నిధులు కేటాయిస్తామని మంత్రి పేర్కొన్నారు. జూన్ 2లోపు భూ సేకరణ కోసం రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని ప్రాజెక్ట్‌లను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులు 2014 జూన్ 2న ఎలా ఉన్నాయో ఇప్పటికీ అలానే ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో చేసిన పొరపాటు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో చేశారని ఆరోపించారు. ఎంత ఖర్చయినా సరే.. మహబూబ్‌నగర్‌లోని ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తామన్నారు.

ఇది కూడా చదవండి : Feeding Centers | బాలింతలకు గుడ్‌న్యూస్.. బస్టాండ్లలో ఫీడింగ్ సెంటర్లు ప్రారంభం

