అక్షరటుడే, వెబ్‌డెస్క్: Iran Israel War | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. Israel – United States సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తున్నాయి. దీంతో Iran లో కీలక మౌలిక సదుపాయాలు దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా ఆ దేశ రాజధాని Tehran లోని ఆయిల్ నిల్వ కేంద్రాలు, రిఫైనరీలపై దాడులు జరగడం ప్రాంతీయంగా తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
Iran Israel War | గల్ఫ్‌లో ఉద్రిక్తత
గల్ఫ్ ప్రాంతంలోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. Bahrain లోని సముద్ర జలాలను తాగునీటిగా మార్చే డిసాలినేషన్ ప్లాంట్‌పై ఇరాన్ డ్రోన్ దాడి జరిపింది. దీంతో ప్లాంట్‌కు నష్టం వాటిల్లిందని అక్కడి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
అదే సమయంలో దక్షిణ ఇరాన్‌లోని Qeshm Island లోని తాగునీటి డిసాలినేషన్ ప్లాంట్‌పై అమెరికా బాంబుల వర్షం కురిపించిందని ఇరాన్ ఆరోపించింది.
Iran Israel War | గల్ఫ్ దేశాలపై దాడుల ఆరోపణలు
Qatar, Saudi Arabia, Kuwait, United Arab Emirates దేశాలు సైతం గొంతు విప్పాయి. తమ దేశ భూభాగాల్లో ఇరాన్ దాడులు జరిగినట్లు ఆ దేశాలు వెల్లడించాయి. కాగా, Masoud Pezeshkian నేతృత్వంలోని ఇరాన్ సర్కారు గల్ఫ్ దేశాలకు క్షమాపణలు చెప్పింది. గల్ఫ్ భూభాగం నుంచి దాడులు జరగకపోతే గల్ఫ్ దేశాలపై దాడులు చేయమని ఆయన హామీ ఇచ్చారు.
లెబనాన్‌లోనూ వైమానిక దాడి
Lebanon రాజధాని Beirut లో ఉన్న ఒక హోటల్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో నలుగురు మృతి చెందినట్లు సమాచారం. ఈ దాడి మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేసింది.
సౌదీ అరేబియాలో..
Saudi Arabia లో జరిగిన దాడుల్లో ఇద్దరు దుర్మరణం చెందినట్లు ఆ దేశ సర్కారు తెలిపింది. మృతుల్లో ఒకరు భారతీయుడు, మరొకరు బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తి ఉన్నట్లు పేర్కొంది. ఈ ఘటనతో గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ ప్రభావం సాధారణ జనంపై పడుతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

