Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Crude Oil Effect | క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Crude Oil Effect | క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం

బిజినెస్​తాజా వార్తలు

Crude Oil Effect | క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం

క్రూడ్ ఆయిల్ ధరలు స్టాక్ మార్కెట్‌కు షాక్ ఇస్తున్నాయి. జియో పొలిటికల్ టెన్షన్స్ నేపథ్యంలో ముడి చమురు ధర బ్యారెల్‌కు 117 డాలర్లు దాటడంతో గ్లోబల్ మార్కెట్లన్నీ భారీ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి.

Srinivas kolluri
Last updated: మార్చి 9, 2026 11:18 ఉద.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Crude Oil Effect
Crude Oil Effect

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Crude Oil Effect | పశ్చిమాసియాలో ఇప్పట్లో శాంతి నెలకొనే పరిస్థితి కనిపించడం లేదు. అమెరికా, ఇరాన్‌ల మధ్య పోరు కొనసాగుతుండడం, ఇరాన్ కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz)ని మూసి వేయడంతో చమురు సరఫరా వ్యవస్థకు ఆటంకాలు ఏర్పడ్డాయి. పలు దేశాలు ముడి చమురు ఉత్పత్తిని నిలిపివేయడంతో క్రూడ్ ఆయిల్ ధరలకు రెక్కలొచ్చాయి.

Contents
  • Crude Oil Effect | భారీ నష్టాలతో ప్రారంభమై..
    • Crude Oil Effect | 2024 తర్వాత అతిపెద్ద పతనం..
      • Crude Oil Effect | అన్ని సెక్టార్లలో రక్తపాతం
      • Crude Oil Effect | లాభాల్లో ఒకే ఒక్కటి..

ఒక్కరోజే సుమారు 30 శాతం వరకు పెరిగి బ్యారెల్ ధర 117 డాలర్లకు చేరింది. 2022 తర్వాత ఇదే అత్యధికం. బ్యారెల్‌కు 150 డాలర్ల వరకు పెరిగే అవకాశాలున్నాయన్న భయాలతో ఇన్వెస్టర్లు ఒత్తిడికి గురవుతున్నారు. క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతుండడం, రూపాయి విలువ పతనమవుతుండడం, విదేశీ సంస్థాగత మదుపరులు పెట్టుబడులు ఉపసంహరిస్తూనే ఉండడంతో మన స్టాక్ మార్కెట్లు (Stock Markets) కోలుకోలేకపోతున్నాయి.

Crude Oil Effect | భారీ నష్టాలతో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 1,862 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 632 పాయింట్లు పతనమైంది. అక్కడినుంచి 909 పాయింట్లు పైకి ఎగబాకింది. నిఫ్టీ 582 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 171 పాయింట్లు కోల్పోయింది. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో 262 పాయింట్లు పెరిగింది.

Crude Oil Effect | 2024 తర్వాత అతిపెద్ద పతనం..

2024 జూన్ 4 తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు రెండో అతిపెద్ద పతనాన్ని నమోదు చేశాయి. అప్పట్లో ప్రధాన సూచీలు 5.7 శాతం నష్టపోయాయి. లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో సెన్సెక్స్ 4,390 పాయింట్లు, నిఫ్టీ 1,380 పాయింట్లు పడిపోయాయి. ఉదయం 11 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 1,915 పాయింట్ల నష్టంతో 77,003 వద్ద, నిఫ్టీ 610 పాయింట్ల నష్టంతో 23,840 వద్ద కదలాడుతున్నాయి.

Crude Oil Effect | అన్ని సెక్టార్లలో రక్తపాతం

అన్ని సెక్టార్ల స్టాక్స్ రక్తమోడుతున్నాయి. నిఫ్టీ (Nifty) ఆటో ఇండెక్స్ 4.77 శాతం, బ్యాంక్ నిఫ్టీ 4.18 శాతం, మెటల్ ఇండెక్స్ 3.67 శాతం, మీడియా 3.65 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 3.61 శాతం, క్యాపిటల్ గూడ్స్ 3.27 శాతం నష్టపోగా.. ఆయిల్ అండ్ గ్యాస్, కన్జూమర్ డ్యూరెబుల్స్, రియాలిటీ, ఎఫ్ ఎంసీజీ, టెలికాం, పవర్, యుటిలిటీ, ఎనర్జీ ఇండెక్స్‌లు రెండు శాతానికిపైగా నష్టంతో ఉన్నాయి.

Crude Oil Effect | లాభాల్లో ఒకే ఒక్కటి..

బీఎస్ఈ సెన్సెక్స్‌లో ఒక స్టాక్ లాభాలతో ఉండగా.. 29 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. హెచ్‌సీఎల్ టెక్ 0.43 శాతం లాభంతో ఉంది.

Top Losers : ఇండిగో 5.90 శాతం, ఎస్‌బీఐ 5.70 శాతం, మారుతి 4.61 శాతం, ఎంఅండ్ఎం 4.53 శాతం, ఆసియన్ పెయింట్ 4.50 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Stock Market Crash | మళ్లీ కుప్పకూలిన మార్కెట్లు.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు

Oppo K14 5G | భారీ బ్యాటరీతో ఒప్పో నుంచి మరో ఫోన్.. మార్చి 9న లాంచ్ కానున్న కే14 మోడల్
MARCH 06 Gold Silver Prices | బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల.. ప్రధాన నగరాల్లో నేటి పరిస్థితి ఏమిటంటే..
Why Air Invisible | మనకు గాలి ఎందుకు కనిపించదో తెలుసా.. దీని వెనుక ఉన్న రహస్యం ఇదే!
Kavitha Arrest Narsingi | నార్సింగ్​లో ఉద్రిక్తత.. కల్వకుంట కవిత అరెస్టు!
Travel Advisory | ఇరాన్‌లో ఉండొద్దు.. భారత పౌరులకు కేంద్రం అడ్వైజరీ
TAGGED:crude oil effectgeopolitical tensionsglobal market fallIndian stock market newsnifty falloil price surgestock market todayStock MarketsStrait of Hormuz
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Heavy Rain Alert Heavy Rain Alert | రైతులకు అలెర్ట్​.. తెలంగాణకు భారీ వర్ష సూచన
Next Article India Oil Reserves India Oil Reserves | ఆయిల్ నిల్వలపై కేంద్రం క్లారిటీ
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?