Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: India Oil Reserves | ఆయిల్ నిల్వలపై కేంద్రం క్లారిటీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - India Oil Reserves | ఆయిల్ నిల్వలపై కేంద్రం క్లారిటీ

జాతీయం

India Oil Reserves | ఆయిల్ నిల్వలపై కేంద్రం క్లారిటీ

దేశంలో చమురు నిల్వలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 7 నుంచి 8 వారాల వరకు సరిపోయే నిల్వలు ఉన్నాయని వెల్లడించింది.

Srinivas kolluri
Last updated: మార్చి 9, 2026 11:27 ఉద.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
India Oil Reserves
India Oil Reserves

అక్షరటుడే, వెబ్​డెస్క్ : India Oil Reserves | దేశంలో చమురు నిల్వలపై కేంద్ర ప్రభుత్వం (Central Government) క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం 250 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురు, రిఫైన్డ్ పెట్రోలియం నిల్వలు ఉన్నాయని వెల్లడించింది.

Contents
  •  India Oil Reserves | పలు కేంద్రాల్లో..
    •  India Oil Reserves | ధరలు పెరుగుతాయా..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హార్ముజ్​ జలసంధి (Strait of Hormuz) మూసివేతతో భారత్​కు పెట్రోలియం దిగుమతులు తగ్గాయి. దీంతో దేశంలో పెట్రోలు నిల్వలు తక్కువగా ఉన్నాయని, ఇవి 25 రోజులకు మాత్రమే సరిపోతాయని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. దేశ అవసరాలకు దాదాపు 7 నుంచి 8 వారాల వరకు సరిపోయే నిల్వలు ఉన్నాయని వెల్లడించింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.

 India Oil Reserves | పలు కేంద్రాల్లో..

దేశంలోని మంగళూరు, పడూర్, విశాఖపట్నంలోని వ్యూహాత్మక కేంద్రాలతో పాటు పైప్‌లైన్లు నౌకల్లో ఈ నిల్వలను భద్రపరిచినట్లు కేంద్రం తెలిపింది. ప్రస్తుతం గల్ఫ్​ దేశాల నుంచి చమురు దిగుమతులు తగ్గాయి. ప్రభుత్వం రష్యా నుంచి దిగుమతులను పెంచింది. దీంతో దేశంలో చమురు నిల్వలకు ప్రమాదం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నారు.

India Oil Reserves
India Oil Reserves

 India Oil Reserves | ధరలు పెరుగుతాయా..

ప్రస్తుతం ముడి చమురు (Crude Oil) ధరలు భారీగా పెరిగాయి. దీంతో దేశంలో పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరుగుతాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం రేట్లు పెంచే ఆలోచన చేయడం లేదని సమాచారం. పెట్రోలియం కంపెనీలనే నష్టాలను భరించాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో సామాన్యులపై భారం పడే అవకాశం లేదు. త్వరలో రేట్లు తగ్గుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ (US President Trump) పేర్కొన్నారు. ధరలు తగ్గకపోతే మాత్రం పెట్రోలియం సంస్థలు ఆ భారాన్ని ప్రజలపై మోపే అవకాశం ఉంది. ఇంధన ధరలు పెరిగితే దేశంలో ద్రవ్యోల్బణం పెరిగే ఛాన్స్​ ఉంది.

ఇది కూడా చదవండి..: President protocol controversy | రాష్ట్రపతి ప్రొటోకాల్ వివాదం.. టీఎంసీపై ప్రధాని ఆగ్రహం

Stock Market Gains | భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
Iran Warns US | అమెరికాకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ వార్నింగ్​
India War Challenges | యుద్ధంతో భారత్​కు సవాళ్లు.. గ్యాస్​, పెట్రోల్​పై మోదీ కీలక ప్రకటన
BJP Bengal Candidates | బెంగాల్​పై బీజేపీ ఫోకస్​.. అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ISIS Threat Hindus | దక్షిణాసియాలో హిందువులపై దాడులకు ఐసిస్ పిలుపు.. సీఈపీ నివేదికలో సంచలన వివరాలు
TAGGED:Central Governmentcrude oil imports indiaenergy security indiaHormuz Strait Crisisindia fuel supplyIndia oil reservesmiddle east tensions oilpetrol diesel prices indiaUS President Trump
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Crude Oil Effect Crude Oil Effect | క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం
Next Article TTD Ghee Tanker Accident TTD Ghee Tanker Accident | టీటీడీకి వెళ్తున్న నెయ్యి ట్యాంకర్ బోల్తా.. 21 వేల లీటర్ల నెయ్యి తోడేసిన స్థానికులు
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?