అక్షరటుడే, వెబ్డెస్క్ : One Rupee Shoes Offer | కొంతమంది దుకాణాదారులు ప్రచారం కోసం చేసే ప్రకటనలు ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. తక్కువ ధరకు వస్తువులు ఇస్తామని ప్రచారం చేస్తుండటంతో వేలాదిగా ప్రజలు తరలి వస్తున్నారు. తీరా జనం వచ్చాక.. ఆయా దుకాణాదారులు చేతులు ఎత్తేస్తున్నారు.
రూపాయికే బూట్లు పంపిణీ చేస్తామంటూ కేరళ (Kerala)లోని ఓ చెప్పుల దుకాణం ప్రకటన ఇచ్చింది. కోళీకోడ్‌లో గల సదరు దుకాణం ఆదివారం ప్రత్యేక ఆఫర్ పేరిట సోషల్ మీడియాలో రూపాయికే బూట్లు అంటూ ప్రచారం చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో ప్రజలు పెద్ద ఎత్తున దుకాణానికి చేరుకున్నారు.
One Rupee Shoes Offer | మొదటి వంద మందికి..

దుకాణ యజమాని రూపాయి నోటు చూపిన మొదటి 100 మందికి ప్రీమియం బూట్లు ఇస్తామంటూ ప్రకటన చేశారు. దీంతో అర్ధరాత్రి 2 గంటల నుంచే వినియోగదారులు దుకాణానికి పోటెత్తారు.దీంతో తెల్లవారుజామున 2 గంటల నుంచే వినియోగదారులు దుకాణానికి పోటెత్తారు. భారీగా ప్రజలు రావడంతో ఆ మార్గంలో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ప్రజలకు సర్దిచెప్పినా వినకపోవడంతో లాఠీచార్జీ (Lathicharge) చేశారు. ఈ ఘటనకు కారణమైన దుకాణ యాజమానిని అరెస్ట్ చేశారు.
One Rupee Shoes Offer | తెలంగాణలో సైతం
గతంలోరాష్ట్రంలో సైతం పలువురు ఇలాంటి ఆఫర్ల పేరిట ప్రజలను మోసం చేశారు. తమ దుకాణాలు ఫేమస్ కావడానికి కొంతమంది ఇలాంటి జిమ్మిక్కులకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ (Hyderabad) శివారులోని ఓ సెకండ్ హ్యాండ్ కార్ల దుకాణం ఓనర్ రూ.25 వేలకే కారు ఇస్తామని గతంలో రీల్స్చేశాడు. తీరా ప్రజలు వచ్చాక కార్లు లేవని చెప్పడంతో వారు గ్యారేజీలోని కార్లను ధ్వంసం చేశారు. గతంలో రూ.4 వేలకే ల్యాప్టాప్, రూ.100కే బ్రాండెడ్ టీ షర్ట్లు, రూ.వెయ్యికే బైక్లు అంటూ పలువురు ప్రచారం చేశారు.
ప్రజలు సైతం ఇలాంటి ప్రచారాలను నమ్మి మోసపోతున్నారు. ఇందులో 99 శాతం ఫేక్ ఉంటున్నాయి. అయినా కూడా పెద్ద ఎత్తున ప్రజలు ప్రకటనలను నమ్మి ఆయా దుకాణాలకు చేరుకుంటున్నారు. దీంతో గందరగోళం నెలకొంటుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేస్తున్నారు. ఇలాంటి ప్రకటనలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..: President protocol controversy | రాష్ట్రపతి ప్రొటోకాల్ వివాదం.. టీఎంసీపై ప్రధాని ఆగ్రహం

