Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Ramagundam NTPC Phase 2 | రామగుండం ఎన్టీపీసీ రెండో దశను వేగవంతం చేయాలి: కిషన్​ రెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Ramagundam NTPC Phase 2 | రామగుండం ఎన్టీపీసీ రెండో దశను వేగవంతం చేయాలి: కిషన్​ రెడ్డి

తెలంగాణతాజా వార్తలు

Ramagundam NTPC Phase 2 | రామగుండం ఎన్టీపీసీ రెండో దశను వేగవంతం చేయాలి: కిషన్​ రెడ్డి

రామగుండం ఎన్టీపీసీ రెండో దశ ప్రాజెక్టును వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు.

Srinivas kolluri
Last updated: మార్చి 9, 2026 5:21 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Ramagundam NTPC Phase 2
Ramagundam NTPC Phase 2

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Ramagundam NTPC Phase 2 | రామగుండం ఎన్టీపీసీ రెండో దశ ప్రాజెక్టును వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి (Union Minister Kishan Reddy) కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) లేఖ రాశారు. తెలంగాణలో విద్యుత్​ డిమాండ్​ గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.

Contents
  • Ramagundam NTPC Phase 2 | 2023లో మొదటి ఫేజ్​ పూర్తి
    • Ramagundam NTPC Phase 2 | త్వరగా పూర్తి చేయాలి
      • Ramagundam NTPC Phase 2 | ఎన్టీపీసీకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి

Ramagundam NTPC Phase 2 | 2023లో మొదటి ఫేజ్​ పూర్తి

రామగుండంలో ఎన్టీపీసీ ఏర్పాటు చేయాల్సిన 4 వేల మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి మొదటి ఫేజ్​ పనులు 2023లో పూర్తయ్యాయన్నారు. సుమారు రూ. 12,000 కోట్ల వ్యయంతో, అధునాతన అల్ట్రా సూపర్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానంతో 2X800=1600 మెగావాట్ల రెండు థర్మల్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందన్నారు. దీనిని 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi)ప్రారంభించి జాతికి అంకితం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అనంతరం సెకండ్ ఫేజ్‌లో భాగంగా 2,400 మెగావాట్ల సామర్థ్యంతో మిగిలిన మూడు పవర్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఎన్టీపీసీ చర్యలు చేపట్టిందన్నారు. మొదటి ఫేజ్‌లో లాగే రెండో ఫేజ్‌లో ఉత్పత్తి చేసే విద్యుత్‌లో 85 శాతం విద్యుత్‌ను తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే సరఫరా చేయనుందన్నారు.

Ramagundam NTPC Phase 2 | త్వరగా పూర్తి చేయాలి

తెలంగాణ (Telangana)లో విద్యుత్ డిమాండ్ మునుపెన్నడూ లేనివిధంగా 18,139 మెగావాట్లకు చేరుకుందని కిషన్​ రెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ అవసరాలు మరింత పెరుగుతాయని, రాష్ట్ర గ్రిడ్ స్థిరత్వం కోసం మరికొంత థర్మల్ విద్యుత్ ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసిందన్నారు. ఈ నేపథ్యంలో, ఆధునికమైన ‘అల్ట్రా సూపర్ క్రిటికల్’ సాంకేతికతతో తక్కువ ఖర్చుకే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ఎన్టీపీసీ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రాజెక్టు విషయంలో సానుకూలంగా స్పందించాలని కోరారు.

Ramagundam NTPC Phase 2 | ఎన్టీపీసీకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి

ఈ ప్రాజెక్టును సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన బొగ్గును సమీకరించుకోవడంలో ఎన్టీపీసీకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని కేంద్ర మంత్రి కోరారు. దీనివల్ల నాణ్యమైన విద్యుత్ మన రాష్ట్రానికి తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చొరవ తీసుకుని, ఎన్టీపీసీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (PPA) చేసుకునేలా కృషి చేయాలని కోరారు.

రామగుండం ఎన్టీపీసీ (NTPC) రెండో దశ ప్రాజెక్టును వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేఖ

రామగుండంలో NTPC ఏర్పాటు చేయవలసిన 4,000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి మొదటి ఫేజ్ లో భాగంగా దాదాపు రూ. 12,000 కోట్ల వ్యయంతో, అధునాతన అల్ట్రా సూపర్ క్రిటికల్… pic.twitter.com/ZuNWoT2WP0

— G Kishan Reddy (@kishanreddybjp) March 9, 2026

 

ఇది కూడా చదవండి..: Legislative Council Building | శాసన మండలి భవనం ప్రారంభం

KTR on Six Guarantees | ఆరు గ్యారంటీలపై అసెంబ్లీలో నిలదీస్తాం : కేటీఆర్​
Mulugu Irrigation Projects | సాగునీటి ప్రాజెక్ట్​లు పూర్తి చేయాలి.. మంత్రుల సమీక్ష
Indigo Emergency Landing | ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్​
march 25 Gold Rates | గోల్డ్​ ప్రియుల్లో ఆనందం.. పెట్టుబడిదారుల్లో ఆందోళన
India UAE Talks | యూఏఈ ప్రెసిడెంట్​కు మోడీ ఫోన్​.. ఏమేమి మాట్లాడుకున్నారంటే..!
TAGGED:india power sectorkishan reddyntpc phase 2 projectramagundam newsramagundam ntpcTelangana electricitytelangana power demandthermal power project
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Nizamabad Collector Inspection Nizamabad Collector Inspection | మైనారిటీ పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
Next Article Shamshabad Airport Shamshabad Airport | శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?