అక్షరటుడే, ఆర్మూర్: Paidi Rakesh Reddy Unity | ప్రతి ఒక్కరూ ఐక్యతతో ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి (Paidi Rakesh Reddy) అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రైతు వేదికలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ (Shaadi Mubarak scheme), రంజాన్ గిఫ్ట్‌ల పంపిణీ (Armoor MLA) కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు (Telangana welfare schemes) చెక్కులు, బహుమతులను అందజేశారు.
Paidi Rakesh Reddy Unity | దేశంలో అన్ని మతాలవారు క్షేమంగా..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచదేశాల్లో అన్ని మతాలవారు (Nizamabad News) ఎక్కడ కూడా ప్రశాంతంగా లేరని.. కేవలం భారతదేశంలో మాత్రమే అన్నివర్గాల వారు భయంలేకుండా రక్షణ వ్యవస్థలో సంతోషంగా ఉన్నారన్నారు. 102 దేశాలతో భారత దేశానికి మంచి సంబంధాలున్నాయన్నారు. దేశం ముఖ్యమని కులాలు మతాలు కాదని ఎమ్మెల్యే అన్నారు. అభివృద్ధి కావాలి అంటే ఐక్యంగా ఉంటే మాత్రమే అభివృద్ధి సాధ్యమని.. గెలిచిన కౌన్సిలర్లు అందరికీ తన తరుపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
Paidi Rakesh Reddy Unity | అన్నిపార్టీలు కలిసి వస్తేనే..
ఆర్మూర్ అభివృద్ధి జరగాలంటే.. అన్ని పార్టీల వారు కలిసి వస్తేనే సాధ్యమవుతుందని రాకేస్ రెడ్డి అన్నారు. అనంతరం 50 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, 15మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ లహరి, వైస్ ఛైర్మన్ వెంకట్ రెడ్డి, ఏఎంసీ ఛైర్మన్ సాయిబాబా గౌడ్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, యమాద్రి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Ramagundam NTPC Phase 2 | రామగుండం ఎన్టీపీసీ రెండో దశను వేగవంతం చేయాలి: కిషన్ రెడ్డి

