అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market Crash | అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలు కనిపించకపోవడంతో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురయ్యారు. కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz)ని ఇరాన్ మూసివేయడంతో చమురు రవాణాకు ఆటంకాలు ఏర్పడడంతో పలు దేశాలు ముడి చమురు ఉత్పత్తిని నిలిపివేశాయి. దీంతో చమురు ధరలు భగ్గుమన్నాయి.
Stock Market Crash | భారీ నష్టాలతో సాగిన మార్కెట్
దీని ప్రభావం స్టాక్ మార్కెట్ (Stock Market)పై కనిపించింది. సోమవారం ఉదయం సెన్సెక్స్ 1,862 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 632 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 582 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 171 పాయింట్లు కోల్పోయింది. మధ్యాహ్నం 2.30 గంటల వరకు భారీ నష్టాలతో సాగిన మార్కెట్లకు జీ7 దేశాలు చమురు ధరలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నాయన్న వార్తలు ఊరటనిచ్చాయి. ఆ దేశాలు వ్యూహాత్మక నిల్వలనుంచి 400 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు నిల్వలను విడుదల చేసే విషయాన్ని పరిశీలిస్తున్నాయని తెలియడంతో క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరలు తగ్గాయి. దీంతో స్టాక్ మార్కెట్ కోలుకుని ఇంట్రాడే కనిష్టాలనుంచి సెన్సెక్స్ 1,287 పాయింట్లు, నిఫ్టీ 381 పాయింట్లు పెరిగాయి. చివరికి సెన్సెక్స్ 1,352 పాయింట్ల నష్టంతో 77,566 వద్ద, నిఫ్టీ 422 పాయింట్ల నష్టంతో 24,028 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market Crash | ఐటీ మినహా..
ఐటీ మినహా మిగిలిన సెక్టార్లన్నీ నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్ 4.10 శాతం, బ్యాంక్ నిఫ్టీ 3.05 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 2.68 శాతం, మెటల్ ఇండెక్స్ 2.60 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.49 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 2.37 శాతం, క్యాపిటల్ గూడ్స్ 2.15 శాతం నష్టపోగా.. ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, టెలికాం, మీడియా, యుటిలిటీ, రియాలిటీ, పవర్ ఇండెక్స్‌లు ఒక శాతానికిపైగా నష్టంతో ముగిశాయి. ఐటీ ఇండెక్స్ మాత్రమే 0.08 శాతం పెరిగింది.
Stock Market Crash | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ ఈలో నమోదైన కంపెనీలలో 972 కంపెనీలు లాభపడగా 3,379 స్టాక్స్ నష్టపోయాయి. 185 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 72 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 875 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 15 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 10 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్ ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 8.25 లక్షల కోట్ల మేర క్షీణించింది.
Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 5 కంపెనీలు లాభాలతో, 25 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. రిలయన్స్ 1.37 శాతం, నస్‌ఫార్మా 0.48 శాతం, ఇన్ఫోసిస్ 0.47 శాతం, టెక్ మహీంద్రా 0.26 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.13 శాతం లాభపడ్డాయి.
Top losers : అల్ట్రాటెక్ సిమెంట్ 5.23 శాతం, మారుతి 4.68 శాతం, ఎంఅండ్ఎం 4.39 శాతం, ఎస్‌బీఐ 3.92 శాతం, ఇండిగో 3.83 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: Gold Silver Rates Today | భగ్గుమంటున్న పసిడి ధరలు.. ఆదివారం గోల్డ్, సిల్వర్ రేట్లు ఇలా ఉన్నాయి!

