Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana Industrial Development | పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించాలి : సీఎస్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Telangana Industrial Development | పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించాలి : సీఎస్​

తెలంగాణ

Telangana Industrial Development | పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించాలి : సీఎస్​

రాష్ట్రంలోని పలు పారిశ్రామికవాడలపై సీఎస్​ రామకృష్ణరావు సమీక్ష నిర్వహించారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 9, 2026 7:40 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Telangana Industrial Development

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Industrial Development |తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్​ఫ్ట్రాస్ట్రక్చర్​ కార్పొరేషన్ (TGIIC) రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న వివిధ మౌలిక సదుపాయాల పనుల పురోగతిపై సీఎస్​ రామకృష్ణరావు (CS Ramakrishna Rao) సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి, రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించడానికి కార్పొరేషన్ అమలు చేస్తున్న ప్రాజెక్టులపై ఆరా తీశారు.

జహీరాబాద్‌లోని ప్రతిపాదిత ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ (Smart City), వరంగల్ సమీపంలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ (Textile Park), మెగా ఇండస్ట్రియల్ హబ్‌ల అభివృద్ధి, ఫార్మా క్లస్టర్‌లు, భారత్ ఫ్యూచర్ సిటీతో సహా అనేక ప్రధాన పారిశ్రామిక ప్రాజెక్టుల పురోగతిపై సమావేశంలో చర్చించారు. ఇప్పటి వరకు వచ్చిన పెట్టుబడులు, గ్రౌండింగ్ చేసిన ప్రాజెక్టుల సంఖ్యను అధికారులు వివరించారు.

review meeting

Telangana Industrial Development |పెద్ద ఎత్తున ఉపాధి

జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ గురించి సీఎస్​ మాట్లాడుతూ.. పెట్టుబడిదారులను ఆకర్షించడానికి కార్పొరేషన్ దృఢమైన, కేంద్రీకృత కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సూచించారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్​తో పెద్ద ఎత్తున ఉపాధిని లభిస్తుందన్నారు. పరిశ్రమలు వీలైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభించేలా మౌలిక సదుపాయాలను కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆయా విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. పరిశ్రమలకు భూ కేటాయింపు కోసం పారదర్శకంగా, ప్రణాళికాబద్ధమైన వ్యూహాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంనద్నారు. ఈ సమావేశంలో రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్లు, TGIIC అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : ACB Catches SI | లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఎస్సైలు

Kavitha New Party | గద్వాల నుంచే కొత్త పార్టీ..: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
Amrabad Rehabilitation Support | ‘అమ్రాబాద్’​ నిర్వాసితులకు అండగా ఉంటాం : భట్టి విక్రమార్క
Drug Test Challenge | కేటీఆర్​ డ్రగ్స్​ టెస్ట్​కు రావాలి.. ​పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​ సవాల్
Kamareddy Sisters Murder | మహిళా దినోత్సవాన్ని.. ప్రశ్నిస్తున్న పసి హృదయాలు!
Road Accident on NH44 | జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. ట్రావెల్స్​ బస్సు బోల్తా.. నలుగురి దుర్మరణం
TAGGED:Kakatiya mega textile parkTelangana industrial developmentTelangana investment projectsTGIIC projects reviewZaheerabad industrial smart city
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Jabardasth Team Kamareddy | Jabardasth Team Kamareddy | కామారెడ్డిలో జబర్దస్త్​ టీం సందడి.. ఆర్టిస్ట్​ సందీప్​ పెళ్లికి హాజరు
Next Article Collector Ila Tripathi Inspection | Collector Ila Tripathi Inspection | కేర్​టేకర్​ అనుచిత ప్రవర్తన… విధుల నుంచి​ తొలగిస్తూ కలెక్టర్​ ఆదేశాలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?