అక్షరటుడే, న్యూఢిల్లీ: March 10 PRE Market Analysis | ఇరాన్‌తో యుద్ధం ముగింపు దశకు చేరుకుంటోందన్న అమెరికా అధ్యక్షుడు(US president) ట్రంప్ ప్రకటనతో క్రూడ్ ఆయిల్ ధరలు శాంతించాయి. దీంతో స్టాక్ మార్కెట్లు(Stock markets) కోలుకున్నాయి. గత సెషన్‌లో యూరోపియన్ మార్కెట్లు నష్టాలతో ముగిసినా.. యూఎస్ మార్కెట్లు మాత్రం లాభపడ్డాయి. మంగళవారం ఉదయం ఆసియా మార్కెట్లు సైతం లాభాల బాటలో సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) గ్రీన్‌లో ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు సైతం భారీ గ్యాప్ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
March 10 PRE Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్‌లో నాస్‌డాక్ 1.38 శాతం ఎస్ అండ్ పీ 0.83 శాతం పెరగ్గా.. మంగళవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ మాత్రం 0.13 శాతం నష్టంతో ఉంది.
March 10 PRE Market Analysis | యూరోప్ మార్కెట్లు..
ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.99 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్(DAX) 0.78 శాతం శాతం, యూకేకు చెందిన ఎఫ్ టీఎస్ ఈ 0.34 నష్టపోయాయి.
ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 6.19 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 3.45 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 3.19 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.40 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.44 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 1.67 శాతం లాభంతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 1.62 శాతం లాభంతో ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు భారీ గ్యాప్ అప్‌లో ప్రారంభం కానున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 6,345 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐ(DII)లు నికరంగా రూ. 9,013 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 0.84 నుంచి 0.99 కు పెరిగింది.
- విక్స్ 17.52 శాతం పెరిగి 23.36 వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 58 పైసలు బలహీనపడి 92.34 వద్ద ఉంది.
- అమెరికా – ఇరాన్‌ల మధ్య యుద్ధంతో గత సెషన్ ఇంట్రాడేలో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర గరిష్టంగా 119 డాలర్లకు చేరిన విషయం తెలిసిందే. ఇరాన్‌తో యుద్ధం ముగింపు దశకు చేరుకుంటోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనతో ధర భారీగా పతనమైంది. ప్రస్తుతం బ్యారెల్ ధర 88.49 డాలర్ల వద్ద ఉంది.
- నిఫ్టీ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.

