Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Trump Russia Oil Sanctions | పుతిన్​తో మాట్లాడిన ట్రంప్​.. చమురు ఆంక్షలపై కీలక నిర్ణయం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Trump Russia Oil Sanctions | పుతిన్​తో మాట్లాడిన ట్రంప్​.. చమురు ఆంక్షలపై కీలక నిర్ణయం

అంతర్జాతీయంతాజా వార్తలు

Trump Russia Oil Sanctions | పుతిన్​తో మాట్లాడిన ట్రంప్​.. చమురు ఆంక్షలపై కీలక నిర్ణయం

చమురు ధరల నియంత్రణకు ట్రంప్​ చర్యలు చేపట్టారు. రష్యాపై విధించిన ఆంక్షలు తొలగిస్తున్నట్లు ప్రకటించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 10, 2026 12:28 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Trump Russia Oil Sanctions
Trump Russia Oil Sanctions

అక్షరటుడే, వెబ్​డెస్క్: Trump Russia Oil Sanctions | అమెరికా, ఇజ్రాయెల్ -ఇరాన్‌పై యుద్ధం నేపథ్యంలో ఇంధన ధరలను తగ్గించడానికి చమురు ఉత్పత్తి చేసే దేశాలపై కొన్ని ఆంక్షలను ఎత్తి వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ (Donald Trump) ప్రకటించారు. ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్​తో మాట్లాడారు.

Contents
  • Trump Russia Oil Sanctions | ఉద్రిక్తతలతో తగ్గిన ట్రంప్​
    • Trump Russia Oil Sanctions | మూడు దేశాలపై..
      • Trump Russia Oil Sanctions | ఫోన్​లో సంప్రదింపులు

రష్యా– ఉక్రెయిన్​ యుద్ధం ప్రారంభం అయ్యాక.. అమెరికా రష్యా ఆయిల్ (Russian Oil)​పై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆ దేశం నుంచి ముడి చమురు కొనుగోలు చేయొద్దని ఆదేశించింది. దీంతో యూరప్​ సహా పలు దేశాలు రష్యా నుంచి చమురు దిగుమతులను ఆపేశాయి. ఈ క్రమంలో భారత్, చైనా రష్యా ఆయిల్​ కొనుగోళ్లను పెంచాయి. భారత్​కు రష్యా డిస్కౌంట్​పై ముడి చమురు సరఫరా చేసింది. అయితే ఇటీవల అమెరికా టారిఫ్ (American Tariff)​ల నేపథ్యంలో భారత్​ రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించింది.

Trump Russia Oil Sanctions | ఉద్రిక్తతలతో తగ్గిన ట్రంప్​

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ట్రంప్​ వెనక్కి తగ్గారు. ఇరాన్​ హార్ముజ్​ జలసంధి (Strait of Hormuz)ని మూసి వేయడంతో పాటు గల్ఫ్​ దేశాలపై దాడులు చేస్తుండటంతో ముడి చమురు రవాణా, ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో రష్యా నుంచి చమురు దిగుమతులకు ట్రంప్​ ఓకే చెప్పారు. ఆ దేశంపై గతంలో విధించిన ఆంక్షలు ఎత్తి వేసినట్లు ప్రకటించారు. కొన్ని దేశాలపై తమ ఆంక్షలు ఉన్నాయని, యుద్ధం సద్దుమణిగే వరకు ఆ ఆంక్షలను ఎత్తివేస్తామని పేర్కొన్నారు. బహుశా మనం వాటిని విధించాల్సిన అవసరం ఉండకపోవచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు.

Trump Russia Oil Sanctions | మూడు దేశాలపై..

రష్యా, ఇరాన్, వెనిజులా చమురు రంగాలపై అమెరికా ఆంక్షలు అమలు చేస్తోంది. చమురు ధరలను తగ్గించే తన ప్రణాళికలలో భాగంగా రష్యాపై ఆంక్షలను సడలించాలని ట్రంప్ పరిశీలిస్తున్నారని తెలిసింది. దీంతో ముడి చమురు ధరలు భారీగా దిగివచ్చాయి. సోమవారం 120 డాలర్లకు చేరిన బ్యారెల్​ క్రూడ్​.. మంగళవారం 90 డాలర్లలోపు పడిపోయింది. దీంతో అన్ని దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి.

Trump Russia Oil Sanctions | ఫోన్​లో సంప్రదింపులు

ఉక్రెయిన్, మధ్యప్రాచ్యంలో వివాదం గురించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ (Vladimir Putin)తో తనకు చాలా మంచి సంభాషణ జరిగిందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్ వివాదం విషయంలో పుతిన్ సహాయ పడాలనుకుంటున్నారు అని పేర్కొన్నారు. పుతిన్ విదేశాంగ విధాన సహాయకుడు మాట్లాడుతూ, ఇరానియన్ సంఘర్షణకు త్వరిత రాజకీయ, దౌత్యపరమైన ముగింపు కోసం పుతిన్ ఒక ఆలోచనను ప్రతిపాదించారని తెలిపారు.

ఇది కూడా చదవండి..: Sri Lanka Fuel Prices | శ్రీలంకలో భారీగా పెరిగిన ఇంధన ధరలు

Bahrain Protests | బహ్రెయిన్​లో చెలరేగిన అల్లర్లు
Power Petrol Price Hike | పెరిగిన పవర్​ పెట్రోల్​ ధరలు
Stock Market Gains | భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
Modi YouTube Subscribers | సోషల్ మీడియాలో మోదీ హవా.. 3 కోట్లు దాటిన యూట్యూబ్‌ సబ్‌స్క్రైబర్లు
Visakhapatnam Firecracker Explosion | విశాఖలో భారీ పేలుడు.. అక్రమంగా నిల్వ చేసిన బాణసంచా పేలి ఇళ్లు ధ్వంసం
TAGGED:American TariffDonald TrumpRussian OilStrait of HormuzTrump Russia Oil SanctionsVladimir Putin
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Crude Oil Price Fall Crude Oil Price Fall | భారీగా తగ్గిన క్రూడ్ ఆయిల్ ధర.. లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు
Next Article BCCI Reward India BCCI Reward India | టీమ్‌ ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ఎన్ని కోట్లో తెలుసా!
4 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?