అక్షరటుడే, వెబ్డెస్క్: BCCI Reward India | టీ 20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత జట్టు ప్రపంచ కప్ ఫైనల్లో అద్బుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) రూ.131 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది.
అహ్మదాబాద్ (Ahmedabad)లో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ అన్ని రంగాల్లో ప్రతిభ కనబరిచి విజయం సొంతం చేసుకుంది. తొలుత బ్యాటర్లు చెలరేగడంతో 255 పరుగులు చేసింది. అనంతరం బౌలర్లు విజృంభించడంతో 159పరుగులకే న్యూజిలాండ్ (New Zealand) అలౌట్ అయింది. కప్ గెలిచిన సందర్భంగా బీసీసీఐ జట్టుకు రూ.131 కోట్లు నజరానా ప్రకటించింది. 2024లో రోహిత్ శర్మ నాయకత్వంలో గెలిచిన జట్టుకు రూ.125 కోట్ల ఇవ్వగా.. ప్రస్తుతం మరో రూ.6 కోట్లు అదనంగా ఇస్తున్నారు.
BCCI Reward India | ఆటగాళ్లు, సిబ్బందికి…
భారత్ టోర్నమెంట్ చరిత్రలో టీ20 ప్రపంచ కప్ (T20 World Cup)ను నిలుపుకున్న మొదటి జట్టుగా నిలిచింది. అంతేకాకుండా మూడు టైటిల్ విజయాలతో ఛాంపియన్‌షిప్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా కూడా రికార్డు సృష్టించింది. ఈ చారిత్రాత్మక విజయంపై ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, సెలెక్టర్లను బీసీసీఐ అభినందించింది. నగదు బహుమతి 15 మంది ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, ఇతర సహాయక సిబ్బందికి వర్తిస్తుంది. ఆటగాళ్లకు రివార్డ్ డబ్బులో ఎక్కువ మొత్తం అందనుంది. సహాయక సిబ్బందికి వారి పాత్రను బట్టి నగదు అందించనున్నారు.
ఇది కూడా చదవండి..: India T20 world Cup Victory | భారత్ థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20 వరల్డ్ కప్ కైవసం

