అక్షరటుడే, ఇందూరు: Property Tax Collections | ఆస్తి పన్ను (Property Tax ) వసూలు చేయడంలో ప్రత్యేక సిబ్బంది మరింత వేగవంతంగా పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ (Dilip Kumar) ఆదేశించారు. నగరంలోని మున్సిపల్ జోన్ 2 కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Property Tax Collections | మొండి బకాయిలపై ప్రత్యేక దృష్టి..
కమిషనర్ మాట్లాడుతూ.. మొండి బకాయిలను కచ్చితంగా వసులు చేయాలన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి యజమానులను కలవాలని సూచించారు. దీర్ఘకాలికంగా బకాయిలు ఉన్న వారికి నోటీసులు అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కార్యాలయంలోని అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించారు. కమిషనర్ వెంట డీఈ సాయిచంద్ తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి..: Sand Illegal Transport | ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు : కలెక్టర్ ఇలా త్రిపాఠి

