అక్షరటుడే, వెబ్డెస్క్: India Gas Shortage | ఇరాన్ యుద్ధంతో గ్యాస్ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. హార్ముజ్ జలసంధిని మూసి వేయడంతో గ్యాస్, ముడి చమురు రవాణా నిలిచిపోయింది. దీంతో గ్యాస్ కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Government) చర్యలు చేపట్టింది. అత్యవసర వస్తువుల చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. గృహావసరాలకే గ్యాస్ వినియోగించేలా.. ఎల్పీజీ పక్కదారి పట్టకుండా ఆంక్షలు అమలు చేయనునంది.
వంట గ్యాస్ సరఫరాకు హామీ ఇవ్వడానికి కేంద్రం నిత్యావసర వస్తువుల చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఎల్పీజీ ఉత్పత్తిని గరిష్ట స్థాయికి పెంచాలని, కీలకమైన హైడ్రోకార్బన్ ప్రవాహాలను LPG పూల్‌లోకి మళ్ళించాలని చమురు శుద్ధి కర్మాగారాలు, పెట్రోకెమికల్ యూనిట్లను ఆదేశించింది.
India Gas Shortage | దిగుమతులపై ఆధారం
భారత్ (India) గ్యాస్ కోసం దిగుమతులపై ఎక్కువగా ఆధార పడుతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 31.3 మిలియన్ టన్నుల LPGని వినియోగించగా.. దేశంలో 12.8 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అయింది. మిగిలిన అవసరాన్ని దిగుమతుల ద్వారా తీర్చారు. దిగుమతుల్లో 85 నుంచి 90 శాతం వరకు సౌదీ అరేబియా వంటి దేశాల నుంచి వచ్చాయి. అయితే అక్కడి నుంచి సరుకు రవాణా హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) నుంచి రావాల్సి ఉంది. ప్రస్తుతం ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేయడంతో గ్యాస్ సరఫరాకు అంతరాయం నెలకొంది. దీంతో కేంద్రం చర్యలు చేపట్టింది.
India Gas Shortage | గృహావసరాలకే…
ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే ఎల్పీజీ ఉత్పత్తి చేయాలి. రిఫైనర్లు పెట్రోకెమికల్స్ తయారీకి ప్రొపేన్, బ్యూటేన్‌ను ఉపయోగించడాన్ని నిషేధించారు. LPGని వంట ప్రయోజనాల కోసం గృహ గృహాలకు మాత్రమే విక్రయించాలి. ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కాగా ఇప్పటికే వాణిజ్య సిలిండర్లపై కేంద్రం ఆంక్షలు విధించింది. చెన్నై, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో హోటళ్లు మూతబడ్డాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మరిన్ని హోటళ్లు మూతపడే అవకాశం ఉందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
ఇది కూడా చదవండి..: Bengaluru Hotels Closed | బెంగళూరు భోజనప్రియులకు షాక్.. నేటి నుంచి హోటల్స్ బంద్!

