అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana Fund Rights | తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రులు బండి సంజయ్ (Bandi Sanjay), కిషన్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
కేంద్రం నుంచి వచ్చే నిధులు కేంద్రం దయ కాదు.. తెలంగాణ హక్కు అని పొన్నం పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు పన్నులు చెల్లిస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం (Central Government) తెలంగాణ అభివృద్ధి కోసం ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణకు రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి చర్చించాలని సూచించారు.
Telangana Fund Rights | ఏపీకి భారీగా నిధులు
పక్కనున్న ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి ప్రతి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయిస్తున్నారని పొన్నం అన్నారు. అందులో సగం కూడా తెలంగాణకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు, రాజకీయాలు వేరన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్రంతో కొట్లాడి రాష్ట్రానికి నిధులు సాధించాలన్నారు. ప్రధాని మోదీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాలకు పన్నుల వాటలో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Telangana Fund Rights | రాష్ట్రాల మీద భారం
కేంద్ర పథకాల్లో కేంద్రం తన వాటాను తగ్గించుకుంటుందని మంత్రి పొన్నం విమర్శించారు. రాష్ట్రాలపై భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కిసాన్ సమ్మాన్ నిధి, సామాజిక పెన్షన్లను పెంచాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులకు 50 శాతం నిధులు కేంద్రం ఇవ్వాలని కోరారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ వద్ద ఉక్కు కర్మాగారం హామీ ఇప్పటికీ అమలు కాలేదన్నారు.
ఇది కూడా చదవండి..: Kalvakuntla Kavitha arrest | కల్వకుంట్ల కవిత అరెస్ట్.. జాగృతి కార్యాలయంలో దీక్ష కొనసాగింపు

