Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: LPG Supply Update | గ్యాస్​ కొరత లేదు.. 10 శాతం​ ఉత్పత్తి పెరిగింది..: కేంద్ర ప్రభుత్వ వర్గాలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - LPG Supply Update | గ్యాస్​ కొరత లేదు.. 10 శాతం​ ఉత్పత్తి పెరిగింది..: కేంద్ర ప్రభుత్వ వర్గాలు

జాతీయం

LPG Supply Update | గ్యాస్​ కొరత లేదు.. 10 శాతం​ ఉత్పత్తి పెరిగింది..: కేంద్ర ప్రభుత్వ వర్గాలు

ఎల్​పీజీ కొరత గురించి వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. దేశవ్యాప్తంగా ఎల్​పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని తెలిపింది.

Srinivas kolluri
Last updated: మార్చి 10, 2026 5:32 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
LPG Supply Update

అక్షరటుడే, వెబ్​డెస్క్​: LPG Supply Update | ఎల్​పీజీ కొరత గురించి వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. దేశవ్యాప్తంగా ఎల్​పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని తెలిపింది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పది శాతం పెంచడం ద్వారా సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఎలాంటి కొరత లేదని వెల్లడించింది. అందువల్ల ధరలను పెంచాల్సిన అవసరం లేదని చెప్పింది.

Contents
  • LPG Supply Update | 40 దేశాల నుంచి దిగుమతి
    • LPG Supply Update | నిత్యం 60 లక్షల సిలిండర్లు సరఫరా
      • LPG Supply Update | ధరల పెంపు కొరత వల్ల కాదు

LPG Supply Update | 40 దేశాల నుంచి దిగుమతి

ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 దేశాల నుంచి ఎల్​పీజీ (LPG)ని దిగుమతి చేసుకుంటున్నామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. హర్ముజ్ జలసంధి వెలుపలి ప్రాంతాల నుంచి గ్యాస్ దిగుమతుల వాటాను 55 శాతం నుంచి 70 శాతానికి పెంచినట్లు పేర్కొంది. దేశంలోని అన్ని రిఫైనరీలు వందశాతం సామర్థ్యంతో నడుస్తున్నాయని తెలిపింది. అందువల్ల ఎలాంటి ధర పెంపు అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

LPG Supply Update | నిత్యం 60 లక్షల సిలిండర్లు సరఫరా

దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సుమారు 60 లక్షల సిలిండర్లు వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సేవలు కొనసాగుతున్నాయని తెలిపింది. పారిశ్రామిక రంగం నుంచి గ్యాస్‌ను మళ్లించడం ద్వారా సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. గృహ వినియోగదారుల కోసం బుకింగ్ వ్యవధిని గతంలో 21 రోజుల నుంచి 25 రోజులకు పొడిగించినట్లు తెలిపారు. డిస్ట్రిబ్యూటర్లకు (Distributors) సరఫరా చేసే సమయం ఇప్పటికీ 2.5 రోజులుగానే ఉందని పేర్కొన్నారు.

LPG Supply Update | ధరల పెంపు కొరత వల్ల కాదు

ఇటీవల గ్యాస్​ ధర రూ.60 పెరిగిన విషయం తెలిసిందే. అయితే ధర పెరుగుదలలో ప్రస్తుత సరఫరా పరిస్థితులకు సంబంధించినది కాదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఇది గతేడాది ఏర్పడిన ఆర్థిక నష్టాలను సర్దుబాటు చేయడం కోసం మాత్రమే చేపట్టిన చర్య అని పేర్కొన్నాయి.

ఇది కూడా చదవండి..: Jal Jeevan Mission Extension | కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు.. జల్ జీవన్ మిషన్‌ పొడిగింపు..

Iran Israel War live updates | ఇరాన్​ అధ్యక్షుడికి భారత్​ ప్రధాని ఫోన్.. యుద్ధం మొదలయ్యాక తొలిసారి పలకరింపు!​
Narhari Zirwal Video | ట్రాన్స్​జెండర్​తో మంత్రి రాసలీలలు.. వీడియో వైరల్!
Farooq Abdullah Attack | ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం.. జెడ్ ప్లస్ భద్రతతో త్రుటిలో తప్పిన ప్రమాదం
Ambulance Miracle Incident | అంబులెన్స్​లో బ్రెయిన్​ డెడ్​ మహిళ.. తిరిగి ప్రాణం పోసిన పెద్ద కుదుపు!
PF Withdrawal App | పీఎఫ్ ఉపసంహరణ మరింత సులభం.. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి కొత్త మొబైల్ యాప్
TAGGED:cooking gas newsDistributorsgas cylinder supplygovernment clarification lpgindia energy newsLPG Production Indialpg shortage indiaLPG Supply Update
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Nizamsagar Canal Incident Nizamsagar Canal Incident | భార్యాభర్తల మధ్య వాగ్వాదం.. కాలువలో దూకిన ఇల్లాలు
Next Article Mahindra Mahindra | తయారీ రంగంలో మహిళల విజయకేతనం.. జహీరాబాద్ మహీంద్రా యూనిట్‌లో ఘనంగా మహిళా దినోత్సవం
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?