అక్షరటుడే, కామారెడ్డి: Nareddy Mohan Reddy | రోడ్డు ప్రమాదంలో రామారెడ్డి మాజీ జడ్పీటీసీ సభ్యుడు నారెడ్డి మోహన్ రెడ్డి(55) (Nareddy Mohan Reddy) మృతి చెందారు. మెదక్ జిల్లా (Medak road accident) తూప్రాన్ సమీపంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
Nareddy Mohan Reddy | రామారెడ్డి మండలం..
రామారెడ్డి మండలం (Ramareddy ZPTC) పోసానిపేట గ్రామానికి చెందిన నారెడ్డి మోహన్ రెడ్డి హైదరాబాద్ నుంచి కామారెడ్డికి (Kamareddy news) వస్తుండగా రోడ్డు పక్కన (Toopran accident) చెట్టును కారు ఢీకొంది. ఈ ఘటనలో మోహన్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా.. కారు డ్రైవర్, కారులో ఉన్న మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.
Nareddy Mohan Reddy | గ్రామంలో విషాదఛాయలు..
మాజీ జడ్పీటీసీ సభ్యుడి మరణంతో రామారెడ్డి మండలంతో పాటు జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా.. మోహన్ రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు. రామారెడ్డి తాజా మాజీ జడ్పీటీసీగా కొనసాగారు. నారెడ్డి స్వచ్ఛంద సంస్థ పేరిట నిరుపేదలకు ఆర్థిక సాయం అందజేస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగించే వారు. తన మన అనే బేధం లేకుండా అందరితో కలుపుగోలుగా ఉండేవారు.
షబ్బీర్అలీకి అత్యంత సన్నిహితుడిగా..
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీకి అత్యంత సన్నిహితుడిగా పేరుపొందారు. దాంతో ఆయనకు జడ్పీ ఫ్లోర్ లీడర్‌గా (Telangana accident news) అవకాశం కల్పించారు. ప్రజా సమస్యలపై నిరంతరం (Telangana local news) ప్రశ్నించే గొంతుకగా పని చేసేవారు. పార్టీలతో సంబంధం లేకుండా సమస్యలపై చర్చించేవారు. దాంతో అందరిలో ఆయనకు మంచి పేరు ఉంది. మాజీ జడ్పీటీసీ మరణవార్త విని కాంగ్రెస్ పార్టీ నాయకులు విచారం వ్యక్తం చేశారు. ఒక మంచి నాయకుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకున్నారు.
ఇది కూడా చదవండి: Temple Circuit | బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ సర్క్యూట్

