అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IndiGo CEO Resignation | ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. కంపెనీ కొత్త సీఈవోను నియమించే వరకు ఎయిర్‌లైన్ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా నిర్వహణ బాధ్యతలు చేపడతారు.
పీటర్ ఎల్బర్స్ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (IndiGo) CEO పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. సంస్థకు ఆయన చేసిన కృషి, సేవకు డైరెక్టర్ల బోర్డు కృతజ్ఞతలు తెలిపింది. ఇండిగో మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా తాత్కాలికంగా ఎయిర్‌లైన్ వ్యవహారాల నిర్వహణను చేపడతారని వెల్లడించింది. త్వరలోనే కొత్త సీఈవోను నియమిస్తామని తెలిపింది.
IndiGo CEO Resignation | వ్యక్తిగత కారణాలతో..
వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేసినట్లు పీటర్ ప్రకటించారు. కాగా గత డిసెంబర్‌లో ఎయిర్‌లైన్ షెడ్యూల్ వైఫల్యం కారణంగా లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. వేలాది ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణకు సైతం ఆదేశించింది. ఈ క్రమంలో CEO పీటర్ ఎల్బర్స్ రాజీనామా చేయడం గమనార్హం. వ్యక్తిగత కారణాలతో తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. నోటీసు వ్యవధిని రద్దు చేయవచ్చని కోరారు. కంపెనీ కోరుకుంటే ఏదైనా బదిలీ, పరివర్తనకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి : LPG Supply Update | గ్యాస్ కొరత లేదు.. 10 శాతం ఉత్పత్తి పెరిగింది..: కేంద్ర ప్రభుత్వ వర్గాలు

