Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Adulterated Ginger Garlic Paste | అసిటిక్ యాసిడ్ – గమ్ పౌడర్​తో అల్లం–వెల్లుల్లి పేస్ట్​ తయారీ.. రెండు టన్నుల కల్తీ సరకు పట్టివేత!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Adulterated Ginger Garlic Paste | అసిటిక్ యాసిడ్ – గమ్ పౌడర్​తో అల్లం–వెల్లుల్లి పేస్ట్​ తయారీ.. రెండు టన్నుల కల్తీ సరకు పట్టివేత!

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Adulterated Ginger Garlic Paste | అసిటిక్ యాసిడ్ – గమ్ పౌడర్​తో అల్లం–వెల్లుల్లి పేస్ట్​ తయారీ.. రెండు టన్నుల కల్తీ సరకు పట్టివేత!

కల్తీ ఆహార పదార్థాల తయారీకి హైదరాబాద్​ కేంద్రబిందువుగా ఉంటోంది. ఎక్కడ చూసినా కల్తీ సరకు దర్శనం ఇస్తోంది. ఇటీవల అధికారుల దాడిలో భారీగా కల్తీ సరకులు పట్టుబడుతున్నాయి.

Naresh chandan
Last updated: మార్చి 10, 2026 10:41 సా.
Naresh chandan
2 వారాలు ago
Share
Adulterated Ginger Garlic Paste | అసిటిక్ యాసిడ్ – గమ్ పౌడర్​తో అల్లం–వెల్లుల్లి పేస్ట్​ తయారీ.. రెండు టన్నుల కల్తీ సరకు పట్టివేత!
Adulterated Ginger Garlic Paste | అసిటిక్ యాసిడ్ – గమ్ పౌడర్​తో అల్లం–వెల్లుల్లి పేస్ట్​ తయారీ.. రెండు టన్నుల కల్తీ సరకు పట్టివేత!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Adulterated Ginger Garlic Paste | గ్రేటర్​ హైదరాబాద్‌లో కల్తీ ఆహార పదార్థాల తయారీ సర్వ సాధారణంగా మారింది. పోలీసుల తనిఖీల్లో పెద్ద మొత్తంలో నిల్వలు పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా మహా నగరంలోని మలక్‌పేట పరిసరాల్లో కల్తీ అల్లం–వెల్లుల్లి పేస్ట్ తయారీ చేస్తున్న యూనిట్‌ వెలుగుచూసింది. సదరు యూనిట్​పై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేసి భారీ మొత్తంలో సరకును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్టు చేశారు.

Contents
  • Adulterated Ginger Garlic Paste | టాస్క్ ఫోర్స్ దాడి
    • Adulterated Ginger Garlic Paste | రసాయనాలు కలిపి..
      • కాలం చెల్లిన లైసెన్స్
      • భారీగా సరకు స్వాధీనం

Adulterated Ginger Garlic Paste | టాస్క్ ఫోర్స్ దాడి

Hyderabad Commissioner’s Task Force కు చెందిన ఖైరతాబాద్ జోన్ బృందం గ్రేటర్​ నగరంలోని మల్లేపల్లి ప్రాంతంలో ఉన్న Shehzada Food Master అనే యూనిట్‌పై ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. Mallepallyలో (Habeeb Nagar పోలీస్ స్టేషన్ పరిధిలో) ఈ యూనిట్ ఉంది.

యూనిట్ యజమాని Mohammed Farooq (50)ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అపరిశుభ్రమైన పరిసరాల్లో ఈ కల్తీ అల్లం–వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి విక్రయిస్తున్నట్లు పోలీసు అధికారులు గుర్తించారు.

Adulterated Ginger Garlic Paste | రసాయనాలు కలిపి..

దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. అల్లం–వెల్లుల్లి పేస్ట్ తయారీలో సింథటిక్ ఫుడ్ కలర్స్, అసిటిక్ యాసిడ్, గమ్ పౌడర్, ఉప్పు వంటి రసాయనాలు కలిపి తయారు చేస్తున్నట్లు తేలింది. సదరు పేస్ట్‌ను మూతలేని ప్లాస్టిక్ కంటైనర్లలో నిల్వ ఉంచుతున్నారని.. దానిని దుమ్ము, ఈగల మధ్యే నిల్వ ఉంచడం వల్ల అది పూర్తిగా అసురక్షితంగా  మారినట్లు అధికారులు గుర్తించారు.

కాలం చెల్లిన లైసెన్స్

యూనిట్‌ Food Safety and Standards Authority of India (FSSAI) లైసెన్స్ 2018లోనే గడువు ముగిసిందని అధికారులు నిర్ధారించారు. అయినా కూడా అల్లం – వెల్లుల్లి పేస్ట్‌ను హైదరాబాద్‌లోని రెస్టారెంట్లు, కిరాణా దుకాణాలు, క్యాటరింగ్ సంస్థలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

భారీగా సరకు స్వాధీనం

సుమారు 875 కిలోల ముడి అల్లం – వెల్లుల్లి, 1,090 కిలోల కల్తీ అల్లం–వెల్లుల్లి పేస్ట్, కల్తీకి ఉపయోగించే రసాయనాలు, గ్రైండింగ్ యంత్రాలు, ఒక మొబైల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ దాదాపు రూ.2.2 లక్షలు ఉంటుందని అంచనా.

నిందితుడితోపాటు స్వాధీనం చేసిన వస్తువులను Habeeb Nagar Police Stationకు అధికారులు అప్పగించారు. ఈ ఘటనపై Cr. No. 53/2026గా కేసు నమోదు చేశారు. Bharatiya Nyaya Sanhitaలోని సెక్షన్ 318(4), 275 కింద దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

IT Job Layoffs | యుద్ధం – ఏఐ ప్రభావం.. ఇక ఐటీ ఉద్యోగాలు ఉండవా.. ఇప్పటికే భారీగా కోత.. నవంబర్​ తర్వాత ఏమి జరగబోతోంది!
Musi Beautification Project | ఇళ్లు కూల్చకుండా మూసీ సుందరీకరణ చేయొచ్చు : కేటీఆర్​
March 18 Pre Market Analysis | లాభాల్లో గిఫ్ట్ నిఫ్టీ.. గ్యాప్ అప్ లో ప్రారంభం కానున్న సెన్సెక్స్, నిఫ్టీ
Hyderabad traffic restrictions | శ్రీరామ నవమి శోభాయాత్ర.. హైదరాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు
Adulterated Ginger Garlic Paste | భారీగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్​ స్వాధీనం​.. ఇద్దరి అరెస్ట్​
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Kukatpally ACB Trap Kukatpally ACB Trap | ఏసీబీకి చిక్కిన కమ్యూనిటీ ఆర్గనైజర్
Next Article Revive Plants Tips | మొక్కలు వాడిపోతున్నాయా.. ఈ చిట్కాలతో పచ్చగా మార్చండిలా! Revive Plants Tips | మొక్కలు వాడిపోతున్నాయా.. ఈ చిట్కాలతో పచ్చగా మార్చండిలా!
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?