అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad Gas Shortage | పశ్చిమాసియాలో ఉద్రిక్తలతో భారత్‌లోని అనేక హోటళ్లు ఇప్పటికే మూతపడ్డాయి. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో కేంద్ర ప్రభుత్వం (Central Government) వాణిజ్య సిలిండర్లపై ఆంక్షలు విధించింది. దీంతో మహా నగరాల్లోని వందలాది హోటళ్లు మూత పడ్డాయి. మరోవైపు కొన్ని హోటళ్లలో తక్కువ గ్యాస్త్ అయ్యే వంటలు మాత్రమే చేస్తున్నారు. తాజాగా గ్యాస్ సంక్షోభం హైదరాబాద్ నగరాన్ని సైతం తాకింది. ఐటీ కారిడార్‌లోని హాస్టళ్ల నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఎల్పీజీ సిలిండర్ల (LPG Cylinders)పై కేంద్రం ఎస్మా ప్రయోగించిన విషయం తెలిసిందే. డెమెస్టిక్ సిలిండర్లను సరఫరా చేయాలని, హోటళ్లకు తగ్గించాలని ఆదేశించింది. హాస్టళ్లు, పాఠశాలలకు సరఫరా చేయాలని చెప్పింది. అయితే పరిమితంగానే సిలిండర్లు సరఫరా చేస్తుండటంతో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్‌సిటీ వంటి హాస్టళ్లలో నిర్వాహకులు ఎక్కువ మంటతో అయ్యే వంటలను చేయమని తెలిపారు. పూట టీ, దోశ, చపాతి, స్నాక్స్ మానేశారు. కేవలం భోజనం మాత్రమే పెడుతున్నారు.
Hyderabad Gas Shortage | కట్టెల పొయ్యి వినియోగం
ప్రస్తుతం నగరంలోని హాస్టళ్లలో దాదాపు 11 లక్షల మంది ఐటీ ఉద్యోగులు, విద్యార్థులకు ఉంటున్నారు. ప్రస్తుతం గ్యాస్ కొరతతో వారు అందరు ఇబ్బంది పడుతున్నారు. వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్లు అరుదైన వస్తువుగా మారడంతో, హాస్టల్ కిచెన్ (Hostel Kitchen)లు పూర్తిగా నిలిచిపోయాయి. పలు హాస్టళ్లలో కనీస అవసరాలను తీర్చడానికి కట్టెల పొయ్యిలను ఉపయోగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Hyderabad Gas Shortage | టీ, దోశలు లేవు
చాలా హాస్టళ్లలో ఉదయం, సాయంత్రం టీ, కాఫీ ఇచ్చేవారు. ప్రస్తుతం మెను నుంచి వాటిని తొలగించారు. తయారు చేయడానికి ఎక్కువ సమయం తీసుకునే చపాతీ, దోశ, పూరీలను కూడా పెట్టడం లేదు. వాటి స్థానంలో అన్నం, సాంబార్ వంటివి అందిస్తున్నారు. గ్యాస్ ధరలు (Gas Prices) ఇటీవల భారీగా పెరిగాయని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా తాము హాస్టల్ ఫీజులను పెంచలేదని చెబుతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకొని హాస్టళ్లకు గ్యాస్ సిలిండర్లను అవసరం మేరకు సరఫరా చేయాలని కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..: PMAY 2.0 Telangana | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. నిర్మాణాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

