అక్షరటుడే, వెబ్‌డెస్క్: Trump Warns Iran | ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) వార్నింగ్ ఇచ్చారు. హార్ముజ్ జల సంధిలో చమురు రవాణా అడ్డుకుంటే దాడులు 20 రెట్లు పెరుగుతాయని హెచ్చరించారు. ట్యాంకర్ షిప్పులకు అమెరికన్ నేవీ ఎస్కార్ట్గా వస్తుందని ప్రకటించారు.
హార్ముజ్ జలసంధి (Strait of Hormuz)లో మైన్లు ఉన్నాయనే వార్తల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసి వేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయిల్, గ్యాస్ ఇతర సరుకు రవాణా నిలిచిపోయింది. అనేక దేశాలు ఆయిల్, గ్యాస్ సంక్షోభంతో అల్లాడుతున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ ఇరాన్ (Iran)కు వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ కీలక జలసంధిలో ఏదైనా మైన్లను తొలగించకపోతే “ఇంతకు ముందు ఎన్నడూ చూడని స్థాయిలో” సైనిక చర్య ఉంటుందని హెచ్చరించారు.
Trump Warns Iran | వాటిని తొలగిస్తాం
హార్ముజ్ జలసంధి మీదుగా సరుకు రవాణా అడ్డుకునేందుకు ఇరాన్ మైన్లు తవ్వుతున్నట్లు వార్తలు వచ్చాయి. వాటిని వెంటనే తొలగించాలని ట్రంప్ ఆదేశించారు. లేదంటే తామే తొలగిస్తామన్నారు.ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఇరాన్ సాంప్రదాయ నావికాదళంతో పాటు జలసంధిని నియంత్రించినట్లు ప్రకటించడంతో ఈ నివేదిక వచ్చింది. జలసంధి మీదుగా అమెరికన్, ఇజ్రాయెల్ నౌకలు, ట్యాంకర్లపై దాడి చేస్తామని IRGC హెచ్చరించింది. మంగళవారం హార్ముజ్ జలసంధి సమీపంలో 16 ఇరానియన్ మైనింగ్ నౌకలను తమ సైన్యం తొలగించిందని అమెరికా తెలిపింది.
ఇది కూడా చదవండి..: Trump Russia Oil Sanctions | పుతిన్‌తో మాట్లాడిన ట్రంప్.. చమురు ఆంక్షలపై కీలక నిర్ణయం

