Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Texas Oil Refinery | ట్రంప్ కీలక ప్రకటన.. టెక్సాస్‌లో అమెరికా మొదటి ఆయిల్ రిఫైనరీ నిర్మాణం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Texas Oil Refinery | ట్రంప్ కీలక ప్రకటన.. టెక్సాస్‌లో అమెరికా మొదటి ఆయిల్ రిఫైనరీ నిర్మాణం

అంతర్జాతీయం

Texas Oil Refinery | ట్రంప్ కీలక ప్రకటన.. టెక్సాస్‌లో అమెరికా మొదటి ఆయిల్ రిఫైనరీ నిర్మాణం

Srinivas kolluri
Last updated: మార్చి 11, 2026 12:18 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Texas Oil Refinery

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Texas Oil Refinery | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక ప్రకటన చేశారు. టెక్సాస్ రాష్ట్రంలోని బ్రౌన్స్‌విల్‌లో కొత్త ఆయిల్ రిఫైనరీ నిర్మించనున్నట్లు ప్రకటించారు. టెక్సాస్‌లో అమెరికా మొదటి ఆయిల్ రిఫైనరీ నిర్మాణంగా పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన సోషల్​ మీడియా ‘ట్రూత్​’లో పోస్టు చేశారు.

Contents
  • Texas Oil Refinery | అమెరికా ఎనర్జీ డామినెన్స్
    • Texas Oil Refinery | ప్రాజెక్ట్ వివరాలివే..
      • Texas Oil Refinery | ఆర్థిక ప్రయోజనాలు, ఉద్యోగావకాశాలు

Texas Oil Refinery | అమెరికా ఎనర్జీ డామినెన్స్

కొత్త రిఫైనరీ అమెరికా మార్కెట్లకు (American markets) అవసరమైన ఇంధన సరఫరాను నిరంతరం కొనసాగించడం ద్వారా దేశ జాతీయ భద్రతను మరింత బలోపేతం చేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. ఇంధన ఉత్పత్తిని గణనీయంగా పెంచుతుందన్నారు. “అమెరికా నిజమైన ఎనర్జీ డామినెన్స్ వైపు మళ్లుతోంది. ఈరోజు నేను గర్వంగా ప్రకటిస్తున్నాను.. అమెరికా ఫస్ట్ రిఫైనింగ్ కంపెనీ 50 ఏళ్లలో దేశంలో మొదటి కొత్త ఆయిల్ రిఫైనరీని టెక్సాస్‌లోని బ్రౌన్స్‌విల్‌లో ప్రారంభించనుంది” అని రాసుకొచ్చారు. భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేటు ఎనర్జీ సంస్థ రిలయన్స్‌ ఈ అపూర్వ పెట్టుబడి పెట్టనున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Reliance Industries Limited) నుంచి దీనిపై ఇంకా అధికారిక స్పందన రాలేదు.

Texas Oil Refinery | ప్రాజెక్ట్ వివరాలివే..

అమెరికా ఫస్ట్ రిఫైనింగ్ కంపెనీ బ్రౌన్స్‌విల్ పోర్ట్ వద్ద నిర్మించనున్నారు. దీని ద్వారా దేశానికి అవసరమైన దీర్ఘకాలిక ఎనర్జీ సామర్థ్యం భారీగా పెరుగుతుందని భావిస్తున్నారు. కాగా.. 2026 సంవత్సరం రెండో త్రైమాసంలో దీని నిర్మాణం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

Texas Oil Refinery

Texas Oil Refinery | ఆర్థిక ప్రయోజనాలు, ఉద్యోగావకాశాలు

ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ద్వారా బిలియన్ల డాలర్ల ఆర్థిక ప్రభావం చూపిస్తుందని, దక్షిణ టెక్సాస్ ప్రాంతంలో వేలాది కొత్త ఉద్యోగాలు సృష్టించనుందని ట్రంప్ వివరించారు. “మా అమెరికా ఫస్ట్ విధానాలు, అనుమతులను సులభతరం చేయడం, పన్నులను తగ్గించడం వల్లే బిలియన్ల డాలర్ల పెట్టుబడులు మళ్లీ అమెరికాకు వస్తున్నాయి” అని చెప్పారు.

ట్రంప్ కీలక నిర్ణయం.. రిలయన్స్‌తో భారీ డీల్ 🇺🇸🇮🇳

అమెరికాలోని టెక్సాస్‌లో భారీ ఆయిల్ రిఫైనింగ్ ప్రాజెక్టును మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత USలో ఏర్పాటవుతున్న తొలి రిఫైనరీ ఇదే కావడం విశేషం. సుమారు $300 బిలియన్ల విలువైన ఈ ప్రాజెక్టులో రిలయన్స్… pic.twitter.com/K2V2K1qSg0

— Tupaki (@tupaki_official) March 11, 2026

ఇది కూడా చదవండి..: Trump Warns Iran | దాడులు 20 రెట్లు పెరుగుతాయి.. ఇరాన్​కు ట్రంప్​ వార్నింగ్​

Dubai Iran Attacks | దుబాయిలో చిక్కుకున్న పలువురు భారతీయులు.. భయంగా ఉందన్న పీవీ సింధు
UAE India Missile Deal | భారత రక్షణ రంగంలో కీలక పరిణామం.. బ్రహ్మోస్​, ఆకాశ్​ కొనుగోలుకు యూఏఈ ఆసక్తి!
India Oil Reserves | యుద్ధం కొనసాగితే ‘బండి’ నడిచేనా?.. భారత్ వద్ద ఎన్ని రోజులకు సరిపడా పెట్రోల్ నిల్వలున్నాయంటే..?
Gold Rates India | మ‌ళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ప్ర‌ధాన న‌గ‌రాల్లో ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!
Iran Missile Attack | అమెరికా నౌక అబ్రహం లింకన్​పై ఇరాన్​ దాడి!
TAGGED:American marketsbrownsville texas refineryDonald Trumpdonald trump energy policyglobal oil industry newsreliance industries investmentReliance Industries LimitedTexas Oil Refineryus economy news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Trump Warns Iran Trump Warns Iran | దాడులు 20 రెట్లు పెరుగుతాయి.. ఇరాన్​కు ట్రంప్​ వార్నింగ్​
Next Article Student Death Investigation RMP Doctor Death | పొలం వద్ద విద్యుదాఘాతంతో ఆర్​ఎంపీ మృతి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?