Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: IRCTC South India Tour | ఐఆర్​సీటీసీ సూపర్ ప్యాకేజీ.. రూ.14,500లకే దక్షిణాది యాత్ర
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - IRCTC South India Tour | ఐఆర్​సీటీసీ సూపర్ ప్యాకేజీ.. రూ.14,500లకే దక్షిణాది యాత్ర

జాతీయం

IRCTC South India Tour | ఐఆర్​సీటీసీ సూపర్ ప్యాకేజీ.. రూ.14,500లకే దక్షిణాది యాత్ర

యాత్రికుల కోసం ఐఆర్​సీటీసీ సూపర్​ ప్యాకేజీ తీసుకొచ్చింది. రూ.14,500 లకే దక్షిణాదిలోని పలు ప్రాంతాలకు తీసుకెళ్లనుంది.

Srinivas kolluri
Last updated: మార్చి 11, 2026 12:35 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
IRCTC South India Tour

అక్షరటుడే, వెబ్​డెస్క్: IRCTC South India Tour | యాత్రికుల కోసం ఐఆర్​సీటీసీ సూపర్​ ప్యాకేజీ తీసుకొచ్చింది. వేసవి సమీపించింది. త్వరలో కాలేజీలు, బడులకు సెలవులు ప్రారంభం కానున్నాయి. దీంతో చాలా మంది పలు పర్యాటక కేంద్రాలు, పుణ్యక్షేత్రాలను సందర్శించాలని భావిస్తారు. అలాంటి వారి కోసం ఐఆర్​సీటీసీ దివ్య దక్షిణయాత్ర- అరుణాచలం- చిదంబరం పేరిట ఓ టూర్‌ ప్యాకేజీని తీసుకొచ్చింది.

Contents
  • IRCTC South India Tour | టూర్​ ఇలా..
    • IRCTC South India Tour | టికెట్​ ధరలు
      • IRCTC South India Tour | భోజనం కూడా..

ఈ ప్యాకేజీలో ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్లు యాత్ర ఉంటుంది. టూటైర్‌ ఏసీ, త్రీటైర్‌ ఏసీ, స్లీపర్‌ క్లాసుల్లో ప్రయాణించడానికి టికెట్లు బుక్​ చేసుకోవచ్చు. అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, తిరుచ్చి, తంజావుర్‌, చిదంబరం ప్రాంతాలను యాత్రలో చుట్టి రావొచ్చు. టికెట్​ రేటు రూ.14,500 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ రైలు సికింద్రాబాద్‌ నుంచి మే 24న బయలు దేరుతుంది. జనగామ, కాజీపేట, వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వేస్టేషన్ల (Renigunta Railway Stations)లో హాల్టింగ్​ ఉంది. ఆయా స్టేషన్​లలో యాత్రికులు రైలు ఎక్కవచ్చు.

IRCTC South India Tour

IRCTC South India Tour | టూర్​ ఇలా..

సికింద్రాబాద్‌ (Secunderabad) నుంచి మే 24న మధ్యాహ్నం 12 గంటలకు రైలు ప్రారంభం అవుతుంది. మొదట అరుణాచలం (Arunachalam) దర్శనం చేసుకుంటారు. అనంతరం రామేశ్వరం పయనం అవుతారు. రామేశ్వరం నుంచి మధురైకి బస్సులో తీసుకెళ్తారు. మీనాక్షి అమ్మవారిని దర్శనం అనంతరం స్థానికంగా షాపింగ్ చేసే వీలు ఉంటుంది. అనంతరం కన్యాకుమారికి వెళ్తారు. ఆరో రోజు శ్రీరంగనాథస్వామి ఆలయం, తంజావూర్‌ (Thanjavur)లోని బృహదీశ్వర ఆలయ దర్శనం చేయిస్తారు. చివరి రోజు చిదంబర నటరాజ స్వామి దర్శనం అనంతరం యాత్రికులు తిరుగు పయనం అవుతారు.

IRCTC South India Tour | టికెట్​ ధరలు

ప్రత్యేక రైలు (Special Train)లో యాత్రికులు వివిధ విభాగాల్లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఎకానమీ (స్లీపర్‌ క్లాస్‌) ఒక్కో టికెట్‌ ధర రూ.14,500. 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.13,500గా నిర్ణయించారు. ప్యాకేజీలో భాగంగా బస చేసే హోటల్‌లో నాన్‌ఏసీ గదులు కేటాయిస్తారు. నాన్‌ ఏసీ వాహనాల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. థర్డ్​ ఏసీ టికెట్ ధర పెద్దలకు రూ.21,700, పిల్లలకు రూ.20,600గా ఉంది. రాత్రిపూట బసకు ఏసీ గదులు కేటాయిస్తారు. సెకండ్​ ఏసీ ధర పెద్దలకు రూ.27,900, పిల్లలకు రూ.26,600.

IRCTC South India Tour | భోజనం కూడా..

ప్యాకేజీలో భాగంగా ఉదయం టీ, టిఫిన్​, మధ్యాహ్నం, రాత్రి భోజనం (శాకాహారం) రైల్వే సిబ్బందే ఏర్పాటు చేస్తారు. బుక్​ చేసుకున్న టికెట్లను బట్టి ప్రయాణికులకు స్థానికంగా ఏసీ, నాన్​ ఏసీ వాహనాలను సమ కూరుస్తారు. ఆయా పర్యాటక కేంద్రాల్లో ప్రవేశ రుసుములు ఉంటే మాత్రం యాత్రికులు చెల్లించాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి..: IndiGo CEO Resignation | ఇండిగో సీఈవో రాజీనామా

Vijay Trisha Together | వివాహ వేడుకకు కలిసి హాజరైన టీవీకే అధినేత విజయ్, సినీ నటి త్రిష కృష్ణన్.. నెట్టింట వైరల్​!
Karnataka Social Media Ban | 16 ఏళ్లలోపు వారికి సోషల్​ మీడియా బ్యాన్​.. కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం
Judiciary Corruption Chapter | 8వ తరగతిలో “న్యాయవ్యవస్థలో అవినీతి” పాఠ్యాంశం.. ఎన్​సీఈఆర్టీపై సుప్రీంకోర్టు మండిపాటు
Delhi Bomb Threat | ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపుల కలవరం
West Bengal Elections | పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక అప్​డేట్​.. 291 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన మమతా బెనర్జీ!
TAGGED:ArunachalamIRCTC South India TourRenigunta Railway StationsSecunderabadSpecial TrainThanjavur
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Student Death Investigation RMP Doctor Death | పొలం వద్ద విద్యుదాఘాతంతో ఆర్​ఎంపీ మృతి
Next Article Red Sorghum Farmers Red Sorghum Farmers | ఎర్రజొన్న రైతులకు అన్యాయం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?