Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Water Tank Inspection | వాటర్​ ట్యాంక్​ ఎక్కిన కలెక్టర్​.. పరిశుభ్రత కార్యక్రమం పరిశీలన
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Water Tank Inspection | వాటర్​ ట్యాంక్​ ఎక్కిన కలెక్టర్​.. పరిశుభ్రత కార్యక్రమం పరిశీలన

నిజామాబాద్

Water Tank Inspection | వాటర్​ ట్యాంక్​ ఎక్కిన కలెక్టర్​.. పరిశుభ్రత కార్యక్రమం పరిశీలన

Srinivas kolluri
Last updated: మార్చి 11, 2026 1:33 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Water Tank Inspection

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Water Tank Inspection | జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్​ ఆధ్వర్యంలో అధికారులు నిత్యం పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం సదాశివనగర్ మండలం (Sadashivanagar Mandal)లో కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు.

Contents
  • Water Tank Inspection | స్వయంగా వాటర్ ట్యాంక్ ఎక్కి..
    • Water Tank Inspection | సమర్థవంతంగా నిర్వహించిన వారికి సన్మానం..
      • వ్యవసాయ క్షేత్రంలో..

Water Tank Inspection | స్వయంగా వాటర్ ట్యాంక్ ఎక్కి..

మండలంలోని ఒకటవ వార్డులో పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పరిశుభ్రత కార్యక్రమానికి కలెక్టర్ (Collector Ashish Sangwan) హాజరై పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్వయంగా ఆయన వాటర్ ట్యాంక్ పైకి ఎక్కారు. ట్యాంకులో కార్మికులు ఎల్లగారి బుచ్చయ్య, ప్రవీణ్​ కార్మికులు నిర్వహిస్తున్న పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఎప్పటికప్పుడు ట్యాంక్​లను శుభ్రం చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

Water Tank Inspection | సమర్థవంతంగా నిర్వహించిన వారికి సన్మానం..

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కార్మికులు విధులను సక్రమంగా నిర్వహిస్తే వారిని సన్మానించాలని కలెక్టర్​ అధికారులకు సూచించారు. ఈ మేరకు పలువురిని సన్మానించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు వాటర్ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో సీఈవో చందర్ ప్రత్యేక అధికారి సతీష్, డీఎల్​పీవో శ్రీనివాస్, పంచాయతీ శాఖ అధికారులు (Panchayat Department Officers) , స్థానిక ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.

వ్యవసాయ క్షేత్రంలో..

మండలంలోని వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నానో యూరియా వాడకంపై అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పంటల్లో నానో యూరియాను డ్రోన్ సాయంతో పిచికారీ చేయడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో ఎరువులు వేయవచ్చని తెలిపారు. ఈ విధానం ద్వారా ఖర్చులు తగ్గడంతో పాటు పంటల దిగుబడి కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంభించి డ్రోన్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులకు నానో యూరియా ప్రయోజనాలు, డ్రోన్ ద్వారా పిచికారీ చేసే విధానం గురించి వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి, సిబ్బంది రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు రేపల్లెవాడ గ్రామపంచాయతీ పరిధిలో మహిళల కోసం మహిళా భవనాన్ని ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే మదన్ మోహన్​కు వారు ధన్యవాదాలు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Fake Number Plate | చలాన్ల నుంచి తప్పించుకునే యత్నం.. తప్పుడు నంబర్ ప్లేట్​తో తిరుగుతున్న డీసీఎం పట్టివేత

Mobile Phone Recovery | స్పెషల్ డ్రైవ్​లో 123 ఫోన్ల రికవరీ: ఎస్పీ రాజేష్ చంద్ర
Owaisi Brothers Home Department | రాష్ట్రంలో ఒవైసీ బ్రదర్స్ చేతిలో హోంశాఖ: బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
Kamareddy Outer Ring Road | ఔటర్ రింగు రోడ్డుకు రూ.500 కోట్లు కేటాయించాలి: కేంద్ర మంత్రిని కోరిన ఎమ్మెల్యే కేవీఆర్
Indiramma Houses Scheme | పథకాలను పక్కాగా అమలుచేయాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
DCC Kamareddy Leaders | పార్టీ బలోపేతం దిశగా పనిచేస్తాం..
TAGGED:Collector Ashish SangwanPanchayat Department OfficersSadashivanagar MandalTelangana local newsWater Tank InspectionYellareddy News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Red Sorghum Farmers Red Sorghum Farmers | ఎర్రజొన్న రైతులకు అన్యాయం
Next Article Shiv Pratap Shukla Governor Shiv Pratap Shukla Governor | గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా ప్రమాణం
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?