అక్షరటుడే, వెబ్డెస్క్ :Kalvakuntla Kavitha New Party |తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా జాగృతి కార్యాలయంలో ఆమె దీక్ష చేపడుతున్నారు.
సోమవారం రాత్రి ఖమ్మం అంబేడ్కర్ భవన్ (Ambedkar Bhavan)లో ఆమె దీక్ష చేపట్టగా.. మంగళవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆమెను హైదరాబాద్కు తరలించారు. దీంతో నగరంలోని జాగృతి కార్యాలయంలో ఆమె దీక్ష కొనసాగిస్తున్నారు.కల్వకుంట్ల కవిత మాట్లాడూతూ.. తాను బీఆర్ఎస్ (BRS)ను విడిచిపెట్టలేదన్నారు. ప్రజల సమస్యలను నిరంతరం లేవనెత్తినందుకు వారు సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మేము ఖచ్చితంగా కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తామని ప్రకటించారు. అది పూర్తిగా రాష్ట్రంపై దృష్టి పెడుతుందన్నారు. తెలంగాణ (Telangana)లో కొత్త పార్టీకి అవకాశం ఉందని పేర్కొన్నారు.
Kalvakuntla Kavitha New Party | ప్రజల కోసం పోరాటం
కాంగ్రెస్ ప్రజల సమస్యలను గాలికి వదిలేసిందని కవిత (Kalvakuntla Kavitha) విమర్శించారు. కొత్తగా ప్రజలకు సమస్యలను తెచ్చి పెడుతోందన్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సైతం ప్రజా సమస్యలపై పట్టించుకోవడం లేదన్నారు. ప్రజలు తమ తరపున మాట్లాడే, వారితో ఉండే సమూహం కోసం చూస్తున్నారని పేర్కొన్నారు. తాము తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
Kalvakuntla Kavitha New Party | తెలంగాణ పార్టీ
BRS, కాంగ్రెస్, BJPతో సహా మన రాష్ట్రంలోని అన్ని పార్టీలు వాటి అసలు ఉద్దేశం నుండి వైదొలిగాయని కవిత అన్నారు. ఇక్కడి ప్రజలు మన సమస్యల గురించి, మన సంస్కృతి గురించి మాట్లాడే ప్రాంతీయ పార్టీని కోరుకుంటున్నారని చెప్పారు. ప్రస్తుతానికి అలాంటి పార్టీ లేదని తెలిపారు. త్వరలో ఏర్పడనున్న తమ పార్టీ, తెలంగాణ గుర్తింపు, హక్కుల కోసం పోరాడే తెలంగాణ పార్టీ అవుతుందన్నారు.
Kalvakuntla Kavitha New Party | ప్రభుత్వం వెనక్కి తగ్గింది
ఖమ్మం నగరంలో ఒకే రోజులో 750 మంది ఇళ్లను తొలగించారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. వారిలో సగానికి పైగా ఇళ్ల స్థలాలకు సంబంధించిన సర్టిఫికెట్లు ఉన్నాయన్నారు. అయినా ఎందుకు కూల్చివేశారని ప్రశ్నించారు. బాధితుల తరఫున తాము నిరాహార దీక్ష చేశామన్నారు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గడం ప్రారంభించిందన్నారు. కాగా ఇళ్లు కోల్పోయిన వారిలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు (Indiramma House) ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ఇది కూడా చదవండి..: Kavuri Sambasiva Rao | కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు మృతి

