అక్షరటుడే, కామారెడ్డి: Citizen Friendly Policing | పోలీస్ స్టేషన్లలో పారదర్శక సేవలు అందించాలని, సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు (Citizen Friendly Policing) ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సెక్షన్ ఇన్ఛార్జీల ఒక రోజు శిక్షణ (Police Training Program) కార్యక్రమంలో ఎస్పీ పాల్గొన్నారు.
Citizen Friendly Policing | పిటిషన్ మేనేజ్‌మెంట్..
ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి వచ్చిన సెక్షన్ ఇన్‌ఛార్జీలతో మాట్లాడి, స్టేషన్లలో పిటిషన్ మేనేజ్‌మెంట్ (Police Administration) సకాలంలో జరుగుతుందా లేదా అనే విషయాలను ఎస్పీ తెలుసుకున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో (Telangana Police) సిబ్బంది అందరినీ సమన్వయం చేసుకుంటూ, ఎటువంటి పక్షపాతం లేకుండా పని విభజన జరగాలని సూచించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సెక్షన్ ఇన్ఛార్జీలకు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి పౌరుడికి సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ పద్ధతిలో సేవలు అందించాలని సూచించారు.
Citizen Friendly Policing | చట్టంపై విశ్వాసం పెరగాలంటే..
చట్టంపై ప్రజలకు విశ్వాసం పెరగాలంటే బాధితులకు సమయానికి న్యాయం (Telangana Police) అందడం అత్యంత ముఖ్యమని ఎస్పీ పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదగా మాట్లాడి, వారి సమస్యలను శ్రద్ధగా విని, తక్షణ పరిష్కారం అందించేలా పోలీసు సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. విచారణ ప్రక్రియలో పారదర్శకత (Public Service Policing) పాటించినప్పుడే పోలీస్ శాఖపై ప్రజల్లో గౌరవం మరింత పెరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా సీనియర్ సిబ్బంది తమ అనుభవాన్ని ఉపయోగించి కొత్తగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు సరైన మార్గదర్శకత్వం అందించి వారిని ఉత్తమ పోలీసులుగా తీర్చిదిద్దాలని కోరారు. ప్రతిరోజు విధులకు హాజరయ్యే ముందు ఆ రోజు చేయాల్సిన పనులను సరైన ప్రణాళికతో సిద్ధం చేసుకుంటే పని ఒత్తిడి తగ్గి, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, పీసీఆర్ సీఐ నరేష్, జిల్లాలోని వివిధ సెక్షన్ ఇన్ఛార్జీలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Cyber Crime Legal Aid | సైబర్ నేర బాధితులకు ఉచిత న్యాయ సహాయం: ఎస్పీ రాజేష్ చంద్ర

